AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Babu Mohan : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయన లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా.. బాబు మోహన్ కామెంట్స్..

బాబు మోహన్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. దశాబ్దాలుగా ఎన్నో వందల చిత్రాల్లో నటించి నటుడిగా, కమెడియన్ గా తనదైన ముద్ర వేశారు. బాబు మోహన్ కామెడీ టైమింగ్, యాక్టింగ్ కు సినిమా ప్రపంచంలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Babu Mohan : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయన లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా.. బాబు మోహన్ కామెంట్స్..
Babu Mohan
Rajitha Chanti
|

Updated on: Mar 31, 2026 | 5:04 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ కమెడియన్లలో బాబు మోహన్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి తనదైన ముద్ర వేశారు. నటుడిగా, హస్యనటుడిగానే కాకుండా విలన్ పాత్రలతోనూ మెప్పించారు. ముఖ్యంగా బాబు మోహన్, కోట శ్రీనివాస్ రావు కాంబోకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి. అందులో చిరంజీవి గొప్పతనం, యాక్టింగ్, ప్రతిభ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిరంజీవి ఇంకా స్టార్ హీరో కాకముందు, అంటే ఆయన రెండో సినిమా ‘కోతల రాయుడు’ షూటింగ్ సమయంలో బాబు మోహన్ ఆయన్ని మొదటిసారి చూశానని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : హీరో ముసలోడు అని కొనేవాడు రాలేదు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

బాబు మోహన్ మాట్లాడుతూ.. “శారధి స్టూడియోలో షూటింగ్ చూడటానికి వెళ్ళా, అక్కడ ఒక చెట్టు కింద సింపుల్‌గా నిలబడి ఉన్న చిరంజీవిని చూసి, ఆయనే హీరో అని తెలియక “ఈ సినిమాలో హీరో ఎవరు సార్?” అని అడిగాను. అప్పుడు చిరంజీవి చాలా వినయంగా “నేనే” అని సమాధానం ఇచ్చారు. ఆ క్షణమే చిరంజీవిలోని తేజస్సు చూసి ఆయన భవిష్యత్తులో పెద్ద హీరో అవుతారని ఊహించాను” అంటూ చెప్పుకొచ్చారు. బాబు మోహన్ ‘అంకుశం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత, చిరంజీవితో కలిసి నటించిన మొదటి చిత్రం ‘స్టువర్ట్‌పురం పోలీస్ స్టేషన్’. అప్పటికే చిరంజీవి అగ్ర హీరోగా ఉన్నప్పటికీ, షూటింగ్ సెట్‌లో తమ మధ్య అన్నదమ్ముల వంటి అనుబంధం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. చిరును ప్రేమగా “చిరన్న” అని పిలిస్తే, చిరంజీవి మాత్రం బాబు మోహన్ పై ఉన్న గౌరవంతో ఆయన్ని “బాబు మోహన్ గారు” అని ఏకవచనంతో పిలవకుండా సంబోధించేవారని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: అలాంటి హీరోను నా జీవితంలో చూడలేదు.. ఆయన వల్లే నా జీవితం మారిపోయింది.. తనికెళ్ల భరణి..

చిరు డాన్స్, ఎనర్జీపై ప్రశంసలు:

చిరంజీవి బాడీ లాంగ్వేజ్ , టైమింగ్ అంటే బాబు మోహన్‌కు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ‘గువ్వ గోరింకతో’ వంటి పాటల్లో చిరు వేసిన స్టెప్పులను ఆయన గుర్తు చేసుకున్నారు. సుమలత, భానుప్రియ, విజయశాంతి, రాధ వంటి హేమాహేమీ హీరోయిన్లతో చిరంజీవి చేసిన డాన్సులు సినిమా హిట్‌ అవ్వడంలో కీలక పాత్ర పోషించేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఫైట్స్ చేసేటప్పుడు హీ-మ్యాన్ లా కనిపించే చిరంజీవి, డాన్స్ ఫ్లోర్ మీదకు వస్తే ఎనర్జీలో ఆయన్ని ఎవరూ బీట్ చేయలేరని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..

Babu Mohan, Chiranjeevi

Babu Mohan, Chiranjeevi

ఎక్కువమంది చదివినవి : Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Follow Us