Love Me Teaser: దెయ్యానికి బాయ్ ఫ్రెండ్ ఉంటే.. ఉత్కంఠభరితంగా ‘లవ్ మీ’ టీజర్..

లవ్ మీ.. ఇఫ్ యు డేర్ అనేది ట్యాగ్ లైన్. అరుణ్ భీమవరం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రౌడీ బాయ్స్ ఫేమ్ యంగ్ హీరో అశిష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక బేబీ సినిమాతో కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్ గా మారిన వైష్ణవి చైతన్య ఈ మూవీలో కథానాయికగా నటిస్తుంది. బేబీ సూపర్ హిట్ తర్వాత వైష్ణవి నటిస్తోన్న సెకండ్ మూవీ కావడంతో లవ్ మీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Love Me Teaser: దెయ్యానికి బాయ్ ఫ్రెండ్ ఉంటే.. ఉత్కంఠభరితంగా 'లవ్ మీ' టీజర్..
Love Me Teaser
Follow us

|

Updated on: Mar 07, 2024 | 5:28 PM

ప్రేక్షకులకు సరికొత్త కథను పరిచయం చేయబోతున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఆయన సొంత ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షితక, నాగ మల్లిడి కలిసి నిర్మిస్తున్న సినిమా లవ్ మీ.. ఇఫ్ యు డేర్ అనేది ట్యాగ్ లైన్. అరుణ్ భీమవరం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రౌడీ బాయ్స్ ఫేమ్ యంగ్ హీరో అశిష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక బేబీ సినిమాతో కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్ గా మారిన వైష్ణవి చైతన్య ఈ మూవీలో కథానాయికగా నటిస్తుంది. బేబీ సూపర్ హిట్ తర్వాత వైష్ణవి నటిస్తోన్న సెకండ్ మూవీ కావడంతో లవ్ మీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన లవ్ మీ ఫస్ట్ లుక్ ఆసక్తిని కలిగించింది. దెయ్యంతో ప్రేమ అంటూ ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీని కలిగించారు మేకర్స్. తాజాగా గురువారం లవ్ మీ టీజర్ రిలీజ్ చేశారు.

“భయమేసే చోట రొమాన్స్..ఇంకా ఎగ్జైటింగ్ గా ఉంటుంది ప్రియా.. ” అంటూ అశిష్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమయ్యింది టీజర్. అలాగని దెయ్యంతో రొమాన్స్ చేయలేం కదా అర్జున్ అంటూ వైష్ణవి చెప్పే డైలాగ్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. దెయ్యానికి బాయ్ ఫ్రెండ్ ఉంటే.. అంటూ ప్రేతాత్మ ప్రేమలో పడిన కుర్రాడిగా కనిపించాడు అశిష్. తాజాగా విడుదలైన టీజర్ లో డైలాగ్స్, విజువల్స్ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇందులో వైష్ణవి కాకుండా దెయ్యం పాత్రలో మరో హీరోయిన్ కనిపించనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. దెయ్యంతో రొమాన్స్ చేయాలనే కోరికతో హీరో హీరోయిన్ తో కలిసి దెయ్యం ఉన్న పాడుబడ్డ బిల్డింగ్ లోకి వెళ్తాడు.. అక్కడ జరిగిన కథే లవ్ మీ స్టోరీ అని తెలుస్తోంది. దెయ్యంతో డేటింగ్, రొమాన్స్, లవ్ అంటూ ఈసారి ప్రేక్షకులకు సరికొత్త కథను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఎంఎం కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరింత ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ఈ చిత్రానికి స్టార్ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. టీజర్ విజువల్స్ మాత్రం మూవీకి గ్రాండియర్ తీసుకువచ్చాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.