
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఊర్వసివో రాక్షసివో. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీలో శిరీష్ సరసన అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రప్రచార కార్యక్రమాలు వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా విజయవాడలో తన సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న శిరీష్.. సమీపంలో ఉన్న ఫేమస్ ఇడ్లీ సెంటర్ ఇడ్లీపాకలో టిఫిన్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.
విజయవాడలో ఊర్వశివో రాక్షసివో ప్రమోషన్లలో పాల్గొన్న శిరీష్.. ముందుగా దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఈ తర్వాత నగరంలోని ఫేమస్ టిఫిన్ సెంటర్ ఇడ్లీ పాకకు వెళ్లి టిఫిన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇక శిరీష్ సింప్లిసిటీని చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు.
మొదట ఈ సినిమా టైటిల్ ప్రేమ కాదంట అని ప్రకటించారు. అయితే ఇటీవలే ఈ టైటిల్ ను మార్తుసూ.. కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, వీడియోస్ ఆకట్టుకుంటున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది.
@AlluSirish Anna has visited the famous “Idly Paka” in Vijayawada during his promotional tour for #UrvasivoRakshasivo
Mark the Day NOV 4th! #AlluAravind @ItsAnuEmmanuel @rakeshsashii #AchuRajamani @tanvirmir @DheeMogilineni #ViijayM @adityamusic @GA2Official pic.twitter.com/oVkThQLbtg
— Demi God Bunny ❤️ (@Tej_AADHF) October 24, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.