Buddy Movie: ఓటీటీలోకి అల్లు శిరీష్ ‘బడ్డీ’ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..

|

Aug 25, 2024 | 1:17 PM

అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆఘస్ట్ 2న విడుదలైంది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఈ సినిమాకు ఆశించినంత రెస్పాన్స్ మాత్రం రాలేదు. విడుదలకు ముందే జోరుగా ప్రచారం నిర్వహించిన కథలో కొత్తదనం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

Buddy Movie: ఓటీటీలోకి అల్లు శిరీష్ బడ్డీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..
Buddy Movie
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో అల్లు శిరీష్. ఇటీవలే యాక్షన్ కామెడీ చిత్రం బడ్డీ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆఘస్ట్ 2న విడుదలైంది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఈ సినిమాకు ఆశించినంత రెస్పాన్స్ మాత్రం రాలేదు. విడుదలకు ముందే జోరుగా ప్రచారం నిర్వహించిన కథలో కొత్తదనం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాను ఆగస్ట్ 30న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

తమిళంలో హీరో ఆర్య నటించిన టెడ్డీకి చిత్రానికి రీమేక్ గా వచ్చింది ఈ మూవీ. ఈ సినిమాకు ఆంటోన్ దర్శకత్వం వహించగా.. ఇందులో గాయత్రి భరద్వాజ్ కథానాయికగా నటించింది. థియేటర్లలో హిట్ కాలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అయినా మెప్పిస్తుందేమో చూడాలి.

బడ్డీ సినిమా కథ..

ఇవి కూడా చదవండి

ఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలట్. విధి నిర్వహణలో భాగంగా ఎక్కువగా ఎయిర్ కంట్రోల్ రూంలో పనిచేస్తున్న పల్లవి (గాయత్రి భరద్వాజ్)తో మాట్లాడుతుంటాడు. ఈ క్రమంలోనే ఇద్దరు నేరుగా కలుసుకోకుండానే ప్రేమలో పడిపోతారు. అయితే ఒకసారి పల్లవి చేసిన చిన్న మిస్టేక్ కారణంగా ఆదిత్య సస్పెండ్ అవుతాడు. తన కారణంగానే సస్పెండ్ అయిన ఆదిత్యకు క్షమాపణ చెప్పాలని వెళ్తున్న పల్లవిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు. దీంతో ఆమె కోమాలోకి వెళ్తుంది. అసలు పల్లవిని ఎవరు కిడ్నాప్ చేశారు ? కోమాలోకి వెళ్లిన పల్లవి ఆత్మ టెడ్డీబేరులోకి ఎలా వచ్చింది ? అనేది మిగతా కథ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.