AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ప్రొడ్యూసర్‏గా షూటింగ్ సెట్‏లోకి అల్లు బాబీ.. బన్నీ ఎమోషనల్ కామెంట్స్..

సినీ పరిశ్రమలో అల్లు వారి ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు రామలింగయ్య నుంచి అల్లు అరవింద్, ఆ తర్వాత అల్లు అర్జున్..

Allu Arjun: ప్రొడ్యూసర్‏గా షూటింగ్ సెట్‏లోకి అల్లు బాబీ.. బన్నీ ఎమోషనల్ కామెంట్స్..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Jul 23, 2021 | 1:54 PM

Share

సినీ పరిశ్రమలో అల్లు వారి ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు రామలింగయ్య నుంచి అల్లు అరవింద్, ఆ తర్వాత అల్లు అర్జున్… అల్లు శీరిష్.. ఇలా ఈ కుటుంబం నుంచి ఎవరో ఒకరు చిత్రపరిశ్రమలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు. అల్లు రామలింగయ్య తర్వాత బడా నిర్మాతగా అల్లు అరవింద్ ఎదిగారు. ఇక ఆ తర్వాత.. అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. అటు శీరిష్ కూడా స్టార్ డమ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక తాజాగా బన్నీ డాటర్ అల్లు అర్హ కూడా చైల్డ్ ఆర్టిస్ట్‏గా వెండితెర ప్రవేశం చేయబోతుంది.

అయితే అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ మాత్రం ఇప్పటివరకు సినిమాల్లో కనిపించలేదు. అల్లు బాబీ అసలు పేరు అల్లు వెంకటేష్. అయితే ఇతనికి నటన పట్ల ఆసక్తి లేదు. అంతేకాదు.. ఎక్కువగా మీడియాలో కనిపించకుండా దూరంగా ఉంటారు. అయితే అల్లు బాబీని కూడా సినీ రంగంలో సెట్ చేసేందుకు అల్లు అరవింద్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు నటనపై ఆసక్తి లేకపోవడంతో.. బడా నిర్మాతగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు ఎంటర్‏టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి..దానిని బాబీ చేతిలో పెట్టారు. అయితే ఇప్పుడు ఇదే బ్యానర్ పై మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న గని చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా గని సెట్స్ వద్ద అన్నయ్య అల్లు బాబీతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. బన్నీ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇది గర్వించదగిన క్షణం.. ఫిల్మ్ మేకర్‏గా అన్నయ్య జర్నీ సక్సెస్‏ఫుల్‏గా సాగాలంటూ.. అల్లు ఎంటర్‏టైన్మెంట్స్‏కు స్వాగతం అని పోస్ట్ పెట్టారు. దీంతో బన్నీ అభిమానులు అల్లు బాబీకి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ట్వీట్..

Also Read: Hyderabad Police: గుర్తుపెట్టుకో సిన్నప్పా.. ఇక్కడున్నది హైదరాబాద్ పోలీసులు.. ఎవ్వరినీ వదలరు..

Pooja Hegde: పూజా హెగ్డే మనసు కూడా అందమే.. ఆల్‌ అబౌట్‌ లవ్‌ పేరుతో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బుట్టబొమ్మ.