
ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలలో టాప్ హీరోలలో అజిత్ ఒకరు. తమిళంలో వరుసగా హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి చిత్రాలతో హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. అటు సినిమాలతోపాటు మోటర్ రేసింగ్లకు సైతం ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని రోజులుగా అజిత్ ఇటు సినిమాల్లో నటిస్తూనే.. అటు కార్ రేసింగ్ లో పాల్గొంటూ విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజిత్ మాట్లాడుతూ.. తన చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. తనకిష్టమైన మోటార్ రేసింగ్ కు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లిదండ్రుల మద్దతు ఇవ్వలేకపోయారని అన్నారు. అయినప్పటికీ తన ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేకపోయారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అజిత్ పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
అజిత్ మాట్లాడుతూ.. “నాకు ఎంతో ఇష్టమైన రేసింగ్ కు అయ్యే ఖర్చును తల్లిదండ్రులు భరించలేకపోయారు. కానీ. వారు నా ఇష్టాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. అలాంటి తల్లిదండ్రులు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. రేసింగ్ వైపు వెళ్లాలని అనిపిస్తోందని చెప్పగానే మా నాన్న చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. రేసింగ్ చాలా ఖరీదైనది. నేను నీకు సాయం చేయలేకపోవచ్చు.. కానీ అందుకు కావాల్సిన స్పాన్సర్స్ ను నువ్వే వెత్తుక్కో.. అందుకు పూర్తిగా సహకరిస్తాం. డిగ్రీ పూర్తి చేయు.. లేదంటే ఏదైన పనిచేసుకుంటూ రేసింగ్ చేయు అని అన్నారు. కానీ సమయం మాత్రం వృధా చేయకు అన్నారు. నేను పని చేసుకుంటూ రేసింగ్ లో పాల్గొనడం ప్రారంభించాను” అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే తాను సినిమాలు, రేసింగ్ రెండింటికి న్యాయం చేయలేకపోతున్నానని.. అందుకే రేసింగ్ ఉన్నప్పుడు సినిమాలకు దూరంగా ఉంటానని అన్నారు. జనవరి జరిగిన 24హెచ్ దుబాయ్ కార్ రేసింగ్ లో అజిత్ పాల్గొని.. తన టీమ్ తో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే బెల్జియలో నిర్వహించిన స్పా ఫ్రాన్ కోర్ ఛాంప్స్ సర్క్యూట్ లో ఆయన టీమ్ రెండో స్థానాన్ని కేవసం చేసుకుంది.
ఇవి కూడా చదవండి :
Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..
Tollywood: రస్నా యాడ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?
Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..