‘డోంట్ టచ్ అంటూ ఆమె కేకలు వేసింది .. చాలా బాధపడ్డాను’.. టాలీవుడ్ విలన్ మానసులో మాట
టాలీవుడ్ విలన్ అజయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇరవై ఎళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న అజయ్.. తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ మువీల్లో ప్రతి నాయకుడు, సహాయనటుడి పాత్రలో నటించి మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు..
టాలీవుడ్ విలన్ అజయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇరవై ఎళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న అజయ్.. తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ మువీల్లో ప్రతి నాయకుడు, సహాయనటుడి పాత్రలో నటించి మెప్పించారు. ‘విక్రమార్కుడు’, ‘ఆర్య-2’, ‘దూకుడు’, ‘రాజన్న’, ‘గబ్బర్‌సింగ్’, ‘18 పేజీస్’, ‘విరూపాక్ష’ వంటి చిత్రాలతో నటుడు అజయ్ పాపులర్ అయ్యారు. ప్రస్తుతం మధుసూదన్ దర్శరత్వంలో తెరకెక్కుతున్న అజయ్ ప్రధాన పాత్రలో ‘చక్రవ్యూహం’ మువీలో నటిస్తున్నారు. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ మువీలో అజయ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు అజయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘విజయన్ దర్శకత్వంలో శ్రీహరి హీరోగా తెరకెక్కిన ఓ సినిమాలో నాది విలస్ పాత్ర. సెట్‌లోకి అడుగుపెట్టిక రేప్ సీన్ షూట్ అని నాకు చెప్పారు. సీన్ షూట్ చేస్తున్నసమయంలో ‘డోంట్ టచ్’ అని ఓ నటి అందరి ముందు కేకలు వేసింది. బహుశా.. అది రేప్ సీన్ షూట్ అని ఆమెకు చెప్పలేదనుకుంటా.. ఆమె ఒక్కసారిగా అలాఅనడంతో నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నా కెరీర్‌లో అదొక చేదు సంఘటన. ఆ తర్వాత ఆ సీన్ మళ్లీ రీ రైట్ చేసి షూట్ చేశారు’ అని కెరీర్ పరంగా తనకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి ఆయన వెల్లడించారు.
ఆ సంఘటన తర్వాత మళ్లీ అలాంటి సీన్స్‌లో ఎప్పుడూ నటించే ప్రయత్నం చేయలేదని చెప్పుకొచ్చారు. తెరపై ఎంతో కఠవుగా కనిపించే అజయ్ నిజ జీవితంలో ఎంతటి సున్నిత మనస్కుడో ఈ సంఘటన బట్టి తెలుస్తోంది.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.