AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mark Antony: మార్క్ ఆంటోనిగా రానున్న యాక్షన్ హీరో విశాల్.. లుక్స్ అదుర్స్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సినిమాలు చేస్తున్నారు విశాల్. విశాల్ సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులోను రిలీజ్ అవుతుంటాయి. ఏడాదికి విశాల్ నుంచి దాదాపు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఇక తాజాగా విశాల్ తన పుట్టిన రోజు కానుకగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. విశాల్ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. విశాల్ సక్సెస్ అందుకొని చాలా కాలం అయ్యింది. చివరిగా లాఠీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విశాల్.

Mark Antony: మార్క్ ఆంటోనిగా రానున్న యాక్షన్ హీరో విశాల్.. లుక్స్ అదుర్స్
Vishal
Rajeev Rayala
|

Updated on: Aug 30, 2023 | 8:10 AM

Share

యాక్షన్ హీరో విశాల్ సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు విశాల్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సినిమాలు చేస్తున్నారు విశాల్. విశాల్ సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులోను రిలీజ్ అవుతుంటాయి. ఏడాదికి విశాల్ నుంచి దాదాపు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఇక తాజాగా విశాల్ తన పుట్టిన రోజు కానుకగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. విశాల్ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. విశాల్ సక్సెస్ అందుకొని చాలా కాలం అయ్యింది. చివరిగా లాఠీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విశాల్. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు విశాల్.

తన పుట్టిన రోజు సందర్భంగా తన నయా మూవీని అనౌన్స్ చేశారు విశాల్. మార్క్ ఆంటోని అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. ఈ బర్త్ డే నాకెంతో స్పెషల్  నా కొత్త సినిమా మార్క్ ఆంటోని తో రాబోతున్నా అని అన్నారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

నా సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన కథలు, వైవిధ్యమైన పాత్రలు చేశాను. ఆడియెన్స్ నన్ను ఎప్పటికీ ఆదరిస్తూనే వచ్చారు. ఇప్పటికీ నా పై ప్రేమ చూపిస్తున్నారు.  వారు అందించిన ఆదరాభిమానాలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను అని చెప్పుకొచ్చారు విశాల్.

ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని తెలిపారు. మార్క్ ఆంటోని పీరియాడిక్ మూవీగా రానుంది. ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో ఎస్.జె.సూర్య కనిపించనున్నారు. ఈ సినిమాలో విశాల్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు విశాల్.

విశాల్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..