Devara: దేవర కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఎన్టీఆర్..? అదే సినిమాకు హైలైట్ కానుందట!

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుందని తెలుస్తోంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో కొరటాల తిరిగి ట్రాక్ లోకి వస్తారని అంటున్నారు ఫ్యాన్స్.

Devara: దేవర కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఎన్టీఆర్..? అదే సినిమాకు హైలైట్ కానుందట!
Devara
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 30, 2023 | 8:12 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. దాంతో ఆయన సినిమాల పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుందని తెలుస్తోంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో కొరటాల తిరిగి ట్రాక్ లోకి వస్తారని అంటున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ మరో హిట్ కొట్టడం ఖాయం అంటున్న నందమూరి ఫ్యాన్స్.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది జాన్వీ. తారక్ తో నటించాలన్నది తన డ్రీమ్ అని అది ఇప్పుడు నెరవేరిందని పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది జాన్వీ. అలాగే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమానుంచి ఆయన లుక్ ను రిలీజ్ చేశారు.

ఇదిలా ఉంటే సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తుంది. అలాగే ఈ మూవీలో అండర్ వాటర్ ఫైట్ ఉంటుందంట. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని టాక్.

ఈ యాక్షన్స్ సీక్వెన్స్ కోసం ఎన్టీఆర్ అండర్ వాటర్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..