Anil Ravipudi: బంపర్ ఆఫర్ అందుకున్న అనిల్ రావిపూడి.. బాలయ్య సినిమా తర్వాత ఆ స్టార్ హీరోతో మూవీ..
మీడియం రేంజ్ హీరోలనుంచి ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అనిల్. అలాగే ఆ తర్వాత వచ్చిన ఎఫ్ 3 సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు. భగవంత్ కేసరి అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన అనిల్ రావిపూడి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మీడియం రేంజ్ హీరోలనుంచి ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అనిల్. అలాగే ఆ తర్వాత వచ్చిన ఎఫ్ 3 సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు. భగవంత్ కేసరి అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ మూవీ లో బాలకృష్ణను డిఫరెంట్ లుక్ లో చూపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విదులైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
View this post on Instagram
ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి క్రేజీ ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. బాలకృష్ణ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
View this post on Instagram
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మెగా అభిమానులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
View this post on Instagram
ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వెంకటేష్, బాలకృష్ణలాంటి సీనియర్స్ ను హ్యాండిల్ చేసిన అనిల్ ఇప్పుడు చిరంజీవితో ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..