Prabhas: సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన బడా ప్రొడక్షన్ హౌస్
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తోన్న సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తోన్న సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమా తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాకేజ్ట్ కే, మారుతితో కలిసి రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. ఇదిలా ఉంటే మరో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కు కూడా డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అనుకున్నారు సుకుమార్. త్వరలోనే సుకుమార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ పనుల్లో ఉన్న సుకుమార్.. ప్రభాస్ కోసం ఓ అదిరిపోయే కథను రెడీ చేశాడట. ఈ కథకు ప్రభాస్ కూడా ఓకే చెప్పారని టాక్. దీని పై క్లారిటీ ఇచ్చారు నిర్మాత అభిషేక్ అగర్వాల్.




అది కేవలం రూమర్ మాత్రమే అని.. సుకుమార్, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా గురించి వస్తున్నావని అవాస్తవాలు అన్ని క్లారిటీ ఇచ్చారు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్.. ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయినా సినిమాలు పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది. వచ్చే ఏడాది వరుసగా ప్రభాస్ మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.




