AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ సినిమా స్టోరీ అంతా మార్చేశారా..? ఈ సారి అలాంటి కథను ఫిక్స్ చేశారట

ప్రస్తుతం మహేష్ ఈ సినిమా చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇటీవల మహేష్ ఇంట్లో వరుస విషాదాలు జరగడంతో మహేష్ మానసికంగా కృంగిపోయారు .

Mahesh Babu: మహేష్ సినిమా స్టోరీ అంతా మార్చేశారా..? ఈ సారి అలాంటి కథను ఫిక్స్ చేశారట
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Dec 27, 2022 | 3:15 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ ఈ సినిమా చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇటీవల మహేష్ ఇంట్లో వరుస విషాదాలు జరగడంతో మహేష్ మానసికంగా కృంగిపోయారు . అన్న, అమ్మ, నాన్న ఇలా ఒకరి వెంట ఒకరు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో మహేష్ బాబు ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ బాధనుంచి బయటకు వస్తున్నారు మహేష్. ప్రస్తతం ఆయన ఫ్యామిలీతో విదేశాలు వెళ్లారు. త్వరలోనే తిరిగి వచ్చి షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్ కూడా జరిగింది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ ఈ సినిమాను ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. ముందుగా మహేష్ సినిమా కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్నారట.. కానీ ఇప్పుడు కథలో చాలా మార్పులు చేశారని. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. రివెంజ్ స్టోరీ కాకుండా సింపుల్ గా ఉండే ఓ అందమైన ఫ్యామిలీ కథను తెరకెక్కుస్తున్నట్ త్రివిక్రమ్. ఈగోల వల్ల కుటుంబంలో వచ్చే కలహాలను ఈ సినిమాలో చూపించనున్నారట. అలాగే ఈ సినిమా లవ్ స్టోరీ కూడా ఉంటుందట. బావ మరదలి మధ్య రొమాన్స్ ను కూడా ఈ సినిమాలో చూపించనున్నారట త్రివిక్రమ్. మొత్తంగా త్రివిక్రమ్ ప్రేక్షకులను మెప్పించేలా కథను మార్చారని అంటున్నారు.  మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.