Aaruguru Pathivrathalu : ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆరుగురు పతివ్రతలు రీరిలీజ్.. ఎప్పుడంటే
ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతుంది. ఆ సినిమానే ఆరుగురు పతివ్రతలు. ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబట్టాయి. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా నుంచి మొదలైన ఈ సినిమా రీరిలీజ్ ట్రెండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతుంది. ఆ సినిమానే ఆరుగురు పతివ్రతలు. ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2004లో తెరకెక్కిన ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది.
ఈ సినిమాలో చాలా మంది కొత్త ఆర్టిస్ట్ లు నటించారు. ఈ సినిమాలో మొత్తంగా నలభై రెండు మంది కొత్తవారు నటించారు. చలపతిరావు, ఎల్.బి.శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కమలాకర్ సంగీతాన్నందించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.
ఆరుగురు పతివ్రతలు సినిమా కూడా రీ రిలీజ్ చేయాలని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ చేయాలని ఇప్పటికే చాలా మంది పెద్ద ఎత్తు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 6 కు ఆరుగురు పతివ్రతలు సినిమాలు రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. దాంతో ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 6న ఆరుగురు పతివ్రతలు సినిమా రీ రిలీజ్ అవుతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.