Aamir Khan : ఏంటీ.. కూలీ సినిమాకు ఆమిర్ ఖాన్ రెమ్యునరేషన్ అంతేనా.. ? రివీల్ చేసిన స్టార్ హీరో..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న చిత్రాల్లో కూలీ ఒకటి. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం జనాలను తెగ ఆకట్టుకుంటుంది. రెండు రోజుల్లోనే రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఇప్పటికీ కూలీ చిత్రం సత్తా చాటుతుంది.

Aamir Khan : ఏంటీ.. కూలీ సినిమాకు ఆమిర్ ఖాన్ రెమ్యునరేషన్ అంతేనా.. ? రివీల్ చేసిన స్టార్ హీరో..
Coolie Cast

Updated on: Aug 16, 2025 | 8:00 PM

జైలర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ మూవీ కూలీ. విక్రమ్, లియో వంటి సూపర్ సెన్సేషన్స్ తర్వాత డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలకపాత్రలు పోషించడంతో హైప్ మరింత పెరిగింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్ధామా అని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానుల ముందుకు వచ్చింది కూలీ. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కూలీ హవా కొనసాగుతుంది. అయితే ముందు నుంచి ఈ సినిమా బడ్జెట్.. తారల రెమ్యునరేషన్స్ గురించి ఏదోక చర్చ నడుస్తూనే ఉంది.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన అమీర్ ఖాన్ రూ.20 కోట్లు తీసుకున్నారని టాక్ నడిచింది. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ఖండించినప్పటికీ రూమర్స్ మాత్రం ఆగలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్.. తన పారితోషికం పై స్పందించారు. రజినీతో స్క్రీన్ పంచుకోవడమే తనకు కోట్ల రూపాయాలతో సమానమని అన్నారు. అందుకు మించి తనకు విలువైనది ఏదీ లేదని.. ఈ సినిమా కోసం తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అన్నారు. రజినీపై ఉన్న ప్రేమ, అభిమానానికి వెలకట్టలేరని అన్నారు. ఆయనతో తెరపై కనిపించడమే తనకు అతిపెద్ద రివార్డ్ అని.. ఇందులో అసలైన హీరోలు నాగార్జున, రజినీకాంత్ అని అన్నారు.

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

ఈ సినిమాను చూసేందుకు జనాలు చూపిస్తున్న ఆసక్తి.. వారి ప్రేమ మొత్తం ఆ ఇద్దరిని చూసేందుకే అని అన్నారు. దీంతో అమీర్ ఖాన్ రెమ్యునరేషన్ రూమర్స్ పై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?