Bhola Shankar: శివరాత్రి పురస్కరించుకొని మెగాస్టార్ భోళాశంకర్ నుంచి నయా మోషన్ పోస్టర్
ప్రస్తుతం చిరు చేస్తోన్న సినిమా భోళాశంకర్. ఈ సినిమాకు స్టైలిష్ డైరెక్టర్ మెహార్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భోళాశంకర్. ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు చిరంజీవి. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి మాస్ మసాలా పాత్రలో కనిపించి అలరించారు. ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు మెగాస్టార్ నెక్స్ట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం చిరు చేస్తోన్న సినిమా భోళాశంకర్. ఈ సినిమాకు స్టైలిష్ డైరెక్టర్ మెహార్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. “భోలా శంకర్” షూటింగ్ జనవరి 17న పునఃప్రారంభమైంది. మెగా బ్లాక్‌బస్టర్ ఫెస్టివల్ వైబ్‌ను కొనసాగిస్తూ హై పాజిటివ్ ఎనర్జీతో రామబ్రహ్మం సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని భారీ కోల్‌కతా సెట్‌లో షూటింగ్ జరుగుతోంది.
తాజాగా శివరాత్రి సందర్భంగా ఈ మూవీ నుంచి మెగాస్టార్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో చిరజీవి ఢమరుకం వాయిస్తూ కనిపించారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే ఈ మోషన్ పోస్టర్ లో మెగాస్టార్ చాలా యాంగ్ గా కనిపిస్తున్నారు.
వాల్తేరు వీరయ్యతో చిరంజీవి భారీ బ్లాక్ బస్టర్ సాధించడంతో భోళా శంకర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెహర్ రమేష్, చిరంజీవిని స్టైలిష్, ఇంకా మాస్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా కథానాయికగా కనిపించనుంది.
క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
