AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

96 Movie: అభిమానులకు షాకిచ్చిన ’96’ జోడీ.. రామ్, జానుల పెళ్లి ఫోటోస్ వైరల్..

96 సినిమాతో వీరిద్దరికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. త్రిష పాత్రలో గౌరీ జి కిషన్ కనిపించగా.. విజయ్ సేతుపతి పాత్రలో ఆదిత్య భాస్కర్ జీవించేశాడు. జాను, రామ్ పాత్రలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఈసినిమా తర్వాత గౌరీకి అవకాశాలు ఎక్కువే వచ్చాయి. తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది గౌరి. అలాగే ఆదిత్య సైతం హీరోగా సక్సెస్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు. ఇటు తెలుగులోనూ గౌరి ఓ సినిమా చేసింది. సంతోష్ శోభన్ నటించిన శ్రీదేవి శోభన్ బాబు చిత్రంలో నటించింది

96 Movie: అభిమానులకు షాకిచ్చిన '96' జోడీ.. రామ్, జానుల పెళ్లి ఫోటోస్ వైరల్..
Ram, Janu
Rajitha Chanti
|

Updated on: Mar 30, 2024 | 8:41 AM

Share

తమిళంలో తెరకెక్కిన 96 సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. త్రిష జంటగా నటించిన ఈ సినిమాకు సౌత్ ఇండస్ట్రీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు మ్యూజిక్ పరంగానూ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో విజయ్, త్రిష చిన్ననాటి పాత్రలలో గౌరీ జి కిషన్.. ఆదిత్య భాస్కర్ కనిపించారు. వీరిద్దరు తమ నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. 96 సినిమాతో వీరిద్దరికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. త్రిష పాత్రలో గౌరీ జి కిషన్ కనిపించగా.. విజయ్ సేతుపతి పాత్రలో ఆదిత్య భాస్కర్ జీవించేశాడు. జాను, రామ్ పాత్రలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఈసినిమా తర్వాత గౌరీకి అవకాశాలు ఎక్కువే వచ్చాయి. తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది గౌరి. అలాగే ఆదిత్య సైతం హీరోగా సక్సెస్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు. ఇటు తెలుగులోనూ గౌరి ఓ సినిమా చేసింది. సంతోష్ శోభన్ నటించిన శ్రీదేవి శోభన్ బాబు చిత్రంలో నటించింది గౌరి. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.

ఇదిలా ఉంటే… ఇప్పుడు రామ్, జాను పెళ్లి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. వీరిద్దరి మ్యారేజ్ ఫోటోస్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. వారిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారని ప్రచారం మొదలైంది. ఇద్దరి పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజానికి గౌరి, ఆదిత్య పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న పోటోస్.. వారిద్దరు కలిసి నటించిన హాట్ స్పాట్ సినిమాలోనివి అని తెలుస్తోంది. ఈ సినిమా మార్చి 29న రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా సినిమాలో తమ పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ.. “ఈ విశ్వంలో రామ్, జాను ఇద్దరు ఒక్కటే.. ఇప్పుడు మరోసారి ఒక్కటయ్యారు.. హాట్ స్పాట్ రేపు విడుదల కాబోతుంది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది గౌరి. అయితే ఇది చూడని జనాలు.. రామ్, జాను నిజజీవితంలో ఒక్కటయ్యారంటూ ఫోటోస్ షేర్ చేస్తూ వారిద్దరికి విషెస్ తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం ఇది కేవలం హాట్ స్పాట్ సినిమా ప్రమోషన్స్ మాత్రమే అని క్లారిటీ ఇస్తున్నారు. మొత్తానికి పెళ్లి ఫోటోలతో అభిమానులకు మాత్రం షాకిచ్చారు అదిత్య, గౌరి.

విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈసినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రామ్, జాను చిన్ననాటి పాత్రలలో ఆదిత్య, గౌరి నటించగా.. వీరి ప్రేమకథ.. చాలా మందికి తొలిప్రేమ తాలూకు మధుర జ్ఞాపకాలను గుర్తుచేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..