Oscar Awards 2023: నాటు నాటు ఊపుతో ప్రారంభమైన ఆస్కార్‌ అవార్డుల వేడుకలు..

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూపు ఆస్కార్. ఆస్కార్ అవార్డు రేస్ లో మన తెలుగు చిత్రమైన 'ఆర్​ఆర్​ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాట పోటీపడుతుంది. ఇప్పటికే ఎన్నో మెట్లను దాటుకొని బరిలో నిలిచిన సాంగ్ ఇది.

Oscar Awards 2023: నాటు నాటు ఊపుతో ప్రారంభమైన ఆస్కార్‌ అవార్డుల వేడుకలు..
Oscar Awards Started

Updated on: Mar 13, 2023 | 6:03 AM

అట్టహాసంగా ప్రారంభమైన అస్కార్ అవార్డుల వేడుక. లాస్ ఏంజిల్స్‏లోని డాల్బీ థియేటర్‏లో అకాడమీ అవార్డ్స్ వేడుక జరుగుతోంది. ప్రపంచమంతా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూసే ఈ వేడుక భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున ఘనంగా షూరు అయ్యింది. నాటు నాటు ఊపుతో ఆస్కార్‌ అవార్డుల వేడుక ప్రారంభమైంది. వేదికపైకి వెళ్లే ముందు కూడా డ్యాన్స్‌ చేసి అలరించారు ఆస్కార్ యాంకర్స్‌. ఆ పాట తర్వాతే ఆవార్డ్‌ను వేదికపైకి తీసుకువచ్చారు ప్రెజెంటర్స్‌. లాస్‌ ఏంజెల్స్ నుంచి ఆస్కార్‌ వేడుకను లైవ్‌లో కళ్లకు గడుతున్న వన్‌ అండ్ ఓన్లీ తెలుగు ఛానల్‌ టీవీ9తెలుగు లైవ్ కవరేజ్. భాషాభేదాలకు అతీతంగా ప్రేక్షకులందరినీ కట్టిపడేసే సినీలోక సందడి.. ప్రపంచ ప్రసిద్ధ నటీనటులందరూ తమ జీవితంలో ఒక్కసారైనా సాధించాలనుకుని కలలు కనే పురస్కారం… అదే అద్వితీయ ఆస్కార్‌ సంబరం. 95వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూపు ఆస్కార్. ఆస్కార్ అవార్డు రేస్ లో మన తెలుగు చిత్రమైన ‘ఆర్​ఆర్​ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట పోటీపడుతుంది. ఇప్పటికే ఎన్నో మెట్లను దాటుకొని బరిలో నిలిచిన సాంగ్ ఇది.

ఆస్కార్‌కు ఇండిపెండెంట్‌గా నామినేట్‌ అయిన ఆర్ఆర్ఆర్. అమెరికా వెళ్లి ట్రిపుల్ ఆర్ సినిమాను ప్రమోట్‌ చేసిన దర్శకుడు రాజమౌళి. ప్రతీ ఈవెంట్‌లో ఆర్ఆర్ఆర్ ఉండేలా చూశారు దర్శకుడు రాజమౌళి. అలాగే ప్రేక్షకులనే కాకుండా హాలీవుడ్ దర్శకులను సైతం ఈ చిత్రిం ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్‌ ప్రాబబుల్స్‌లో చోటు దక్కడంతో అవార్డుపై ఆశలు పెరిగాయి. నెలల తరబడి అమెరికాలోనే ఉండి ఫాలోఅప్‌ చేశారు జక్కన్న. అయితే బెస్ట్ మూవీ కేటగిరిలో ఇండియా నుంచి గుజరాతీ సినిమా ఛెల్లో షో అఫీషియల్ ఎంట్రీ ఇచ్చింది.

రాజమౌళి రూపొందించిన్న ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని ఔట్ స్టాండింగ్ అంటూ పొగడ్తలు కురిపించారు హాలీవుడ్‌ దర్శక దిగ్గజం స్పీల్ బర్గ్. 100 ఏళ్ల ఇండియన్ సినిమాకు.. 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రకు ట్రిబ్యూట్. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారనున్న ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా. ఇప్పటికే నాటునాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌, HCA,జపాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.