72nd National Film Awards: జాతీయ చలన చిత్ర అవార్డులలో సత్తా చాటిన తెలుగు సినిమా.. ఏకంగా 9 అవార్డులతో సంచలనం..
72వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. మొత్తం 9 కేటగిరీల్లో తెలుగు సినిమాలకు అవార్డులు దక్కాయి. భారీ పాన్ ఇండియా చిత్రాలు బరిలో ఉన్నా కొన్ని చిన్న సినిమాలు జాతీయ అవార్డుల వేదిక మీద ప్రూవ్ చేసుకున్నాయి. ఇంతకీ ఈసారి జాతీయ చలన చిత్ర పురస్కారాలను గెలుచుకున్న సినిమాలేంటో చూద్దాం.

72వ జాతీయ చలన చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా సత్తా చాటింది. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డులలో కొన్నేళ్లుగా తెలుగు సినిమా దూసుకుపోతుంది. గతేడాది ఏడు విభాగాల్లో పురస్కారాలు సొంతం చేసుకున్న టాలీవుడ్.. ఇప్పుడు శనివారం (జూలై 18)న ప్రకటించిన 72వ జాతీయ అవార్డులలో ఏకంగా 9 పురస్కారాలు దక్కించుకుంది. అగ్రతారలు నటించిన భారీ బడ్జెట్ సినిమాల నుంచి సరికొత్త కంటెంట్ తో తెరకెక్కించిన చిన్న చిన్న చిత్రాలు ఈసారి జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో రికార్డులు తిరగరాసాయి. ఈసారి జాతీయ పురస్కారాల్లో మెరిసిన తెలుగు సినిమాల జాబితాను చూస్తే.. చిన్న చిన్న సినిమాలు.. కొత్త నటీనటులతోపాటు సీనియర్ తారలు సైతం పురస్కారాలు సొంతం చేసుకున్నారు. శనివారం ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డులలో సత్తా చాటిన తెలుగు సినిమాలను ఇప్పుడు చూద్దాం.
* నిర్మాతగా తొలి ప్రయత్నంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును సాధించారు మెగా డాటర్ నిహారిక. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన కమీటి కుర్రాళ్లు సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో పాటు బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు దక్కింది.
* అలాగే పుష్ప 2 ది రూల్ సినిమాకు గాను ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా సుకుమార్ అవార్డు సాధించారు. ఇదే సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో దీపాళి నూర్, శీతల్ శర్మకు అవార్డు అందుకోబోతున్నారు.
* ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా కూడా 72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటింది. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్‌తో పాటు బెస్ట్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్మెంట్ మూవీ విభాగాల్లో ఈ సినిమా అవార్డులు దక్కించుకుంది.
* దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమాకు ఉత్తమ మాటల రచయితగా వెంకీ అట్లూరి నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి సంచలన విజయం సాధించిన 35 చిన్న కథ కాదు మూవీకి కూడా రెండు అవార్డుల దక్కాయి. ఈ సినిమాకు ఉత్తమ బాలల చిత్రంగా అవార్డు దక్కింది. కీలక పాత్రలో నటించిన అరుణ్‌దేవ్ పోతుల ఉత్తమ బాల నటుడిగా ఎంపికయ్యారు.
ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..
