Sarayu Roy: ఎవరినీ హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు.. క్షమాపణలు చెప్పిన సరయు
యూట్యూబ్ పాపులర్ యాక్టర్ సరయుని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మహిళలని కించపరిచే విధంగా షార్ట్ ఫిల్మ్ తీసినందుకు యూట్యూబర్ సరయు..
Sarayu Roy: యూట్యూబ్ పాపులర్ యాక్టర్ సరయుని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మహిళలని కించపరిచే విధంగా షార్ట్ ఫిల్మ్ తీసినందుకు యూట్యూబర్ సరయు, ఆమె అనుచరుల బృందాన్ని బంజరాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సరయూ(Sarayu Roy) ఆమె బృందం 7 ఆర్ట్స్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది సిరిసిల్లలో ఏర్పాటు చేసే రెస్టారెంట్ కోసం సరయు, ఆమె బృందం ఓ షార్ట్ ఫిల్మ్ షూట్ చేశారు. ఇందులో మహిళలు, హిందు సమాజాన్ని కించపరిచారని రాజన్న సిరిసిల్ల జిల్లా వీహెచ్‌పీ అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్లలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని బంజరాహిల్స్ పోలీసులకు బదిలీ చేశారు.
సరయు రాయ్‌ని రెండో రోజు విచారించారు పోలీసులు. సరయుపై 41A CRPC కింద నోటీసులు ఇచ్చిన బంజారాహిల్స్ పోలీసులు, 153 A, 295 A కింద కేసులు నమోదు చేశారు. సెవెన్ ఆర్ట్స్ హోటల్ ప్రమోషన్ కోసం చేసిన వీడియోలోని దృశ్యాలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నది సరయుపై ఉన్న ప్రధాన అభియోగం. హోటల్ ప్రచార వీడియోలో సరయు అండ్ కో.. గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ని తలకు ధరించి, చేతిలో కర్రలు పట్టుకున్నారు. హోటల్ లోపలికి వెళ్లి లవర్స్‌పై దాడి చేశారు. ఓనర్ బెదిరించి ఆఖరికి ఆతనితోనే రొమాన్స్‌లో పడడం వివాదానికి ఆజ్యం పోసింది. ఈ వీడియోలోని దృశ్యాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు వీహెచ్‌పీ సిరిసిల్ల అధ్యక్షుడు అశోక్. ఈ కేసును బంజారాహిల్స్ ఠాణాకు ట్రాన్స్‌ఫర్ చేశారు సిరిసిల్ల పోలీసులు. దీంతో తన న్యాయవాదితో కలిసి పోలీసుల విచారణకు హాజరైంది సరయు. తాను హిందువునే అని చెబుతున్నారు సరయురాయ్. ఎవరినీ కించపరిచేందుకు ఆ వీడియో చేయలేదని, అలాంటి ఉద్దేశం కూడా లేదంటోంది సరయు.
మరిన్ని ఇక్కడ చదవండి :