Naga Chaitanya : హర్రర్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో అలరించనున్న అక్కినేని కుర్ర హీరో

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో వరుస విజయాలను అందుకుంటున్నాడు.

Naga Chaitanya : హర్రర్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో అలరించనున్న అక్కినేని కుర్ర హీరో
Naga Chaitanya
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 09, 2022 | 6:43 AM

Naga Chaitanya : అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో వరుస విజయాలను అందుకుంటున్నాడు. గతఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాతో మంచి విజయం అదనుకున్నాడు చైతన్య(Naga Chaitanya). అందమైన లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రీసెంట్ గా బంగార్రాజు(Bangarraju) సినిమాతో మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు నాగ చైతన్య. అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన బంగార్రాజు సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో బంగార్రాజుగా నటించి ఆకట్టుకున్నాడు నాగచైతన్య. ఇక ఇప్పుడు విక్రమ్ కుమార్  దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు థాంక్యూ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమాలో చైతన్య హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో అందాల భామ రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే నాగ చైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నాడు ఈ అక్కినేని యంగ్ హీరో. ఈ సినిమాలో అమీర్ ఖాన్ స్నేహితుడిగా చైతన్య కనిపించనున్నాడు. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. అమెజాన్ కోసం ఒక హర్రర్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య చేయబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కథ విన్న వెంటనే నాగ చైతన్య చాలా ఎగ్జైట్ అయ్యాడని.. ఇలాంటి ఒక వెబ్ సిరీస్ లో నటించడం కోసం ఆసక్తిగా ఉన్నానంటూ చైతన్య తెలిపినట్టు సమాచారం. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmi Gautam: పాల బుగ్గలు చిన్నది.. పరువాలు వంపుతూ ఫోజులిచ్చిందిగా…

Nandita Swetha: ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు.. నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Sehari: బాల‌య్య‌బాబు గారి వ‌ల్లే మా సినిమా స్థాయి పెరిగింది.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్