Vijaya Shanthi: కర్తవ్యం సినిమా విడుదలై 32 ఏళ్లు.. మన రాములమ్మ రియాక్షన్‌ ఏంటంటే..

Vijaya Shanthi: విజయశాంతి ఎన్నో సినిమాలు చేసి ఉండచ్చు గాక.. తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌ డూపర్‌ హిట్ సినిమాలు ఉండచ్చు గాక.. అయితే ఒక సినిమా మాత్రం ఆమె కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అదే కర్తవ్యం (Kartavyam).

Vijaya Shanthi: కర్తవ్యం సినిమా విడుదలై 32 ఏళ్లు.. మన రాములమ్మ రియాక్షన్‌ ఏంటంటే..
Vijayasanthi

Edited By: Ravi Kiran

Updated on: Jun 30, 2022 | 6:41 AM

Vijaya Shanthi: విజయశాంతి ఎన్నో సినిమాలు చేసి ఉండచ్చు గాక.. తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌ డూపర్‌ హిట్ సినిమాలు ఉండచ్చు గాక.. అయితే ఒక సినిమా మాత్రం ఆమె కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అదే కర్తవ్యం (Kartavyam). అప్పటివరకు కేవలం హీరోయిన్‌గానే మెప్పించిన విజయశాంతి (Vijaya Shanthi)కి ఈ సినిమా లేడీ సూపర్ స్టార్‌, లేడీ అమితాబ్‌ అన్న ట్యాగ్‌లను తీసుకొచ్చింది. ప్రముఖ లేడీ ఐపీఎస్ ఆఫీస‌ర్ కిర‌ణ్ బేడీ స్ఫూర్తితో డైరెక్టర్ మోహ‌న‌గాంధీ (Mohana Ganghi) రూపొందించిన ఈ సినిమాలో నిజాయతీ గల పోలీస్‌ ఆఫీసర్‌గా నట విశ్వరూపం చూపించారు విజయశాంతి. 1990 జూన్ 29న విడుదలైన ఈ చిత్రం అప్పట్లోనే రూ. 3కోట్లకు పైగా వసూలు చేసి విజయశాంతి ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది. కాగా ఈ చిత్రం విడుదలై జూన్ 29 నాటికి 32 సంవత్సరాలు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా కర్తవ్యం సినిమా పోస్టర్లతో లేడీ సూపర్‌స్టార్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్‌. వీటిని గమనించిన రాములమ్మ.. తన ఫేస్‌బుక్ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నా కర్తవ్యం సినిమా రిలీజ్ అయి నేటికి 32 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా..స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని అందించినందుకు శుభాకాంక్షలు తెలియజేసిన నా అభిమానులకు ధన్యవాదాలు.. ఈ సినిమా నాకెప్పుడూ స్ఫూర్తినిస్తుంటుంది. ఇట్లు మీ విజయశాంతి’ అని అందులో రాసుకొచ్చారు లేడీ అమితాబ్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరలవుతోంది. మరికొందరు ఫ్యాన్స్‌ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..