Tollywood : సమ్మర్ సినిమా జాతర.. ఏకంగా 20 సినిమాలు రిలీజ్.. అవేంటంటే
2023 వేసవిలో 20 చిత్రాలు అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఇక ఈసారి సమ్మర్ లో అలరించడానికి రెడీ అవుతున్న సినిమాలు ఏవో తెలుసా..

హాలిడేస్ లో సినిమాలను రిలీజ్ చేస్తే రిజల్ట్ వేరేలా ఉంటుందని అందరికి తెలుసు.. మంచి సినిమాలు సూపర్ హాట్ అవుతాయి. హిట్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవుతాయి. ఎందుకంటే సెలవులను టార్గెట్ చేసి సినిమాలను రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఎక్కువగా సినిమాలు చూస్తుంటారు. అందుకే దర్శక నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి, సమ్మర్ లో ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. 2023 వేసవిలో 20 చిత్రాలు అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఇక ఈసారి సమ్మర్ లో అలరించడానికి రెడీ అవుతున్న సినిమాలు ఏవో తెలుసా..
వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాసింది నేచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ గురించి. ఈ సినిమా మార్చి 30న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ కనిపించని మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఏప్రిల్ 7వ తేదీన రావణాసురుడు మీటర్ అలాగే అహింస అనే మూడు సినిమాలను ఒకేసారి విడుదల కానున్నాయి.
ఆతర్వాత ఏప్రిల్ 14న మరో మూడు సినిమాలు శాకుంతలం గూఢచారి అలాగే బిచ్చగాడు 2 విడుదలవుతాయి. ఆ తర్వాత విరూపాక్ష – నేను స్టూడెంట్ సర్ సినిమాలు ఏప్రిల్ 21న విడుదల కానున్నాయి. చివరగా 28న అఖిల్ ఏజెంట్ విడుదల కానుంది. మే 5 న రామ బాణం, ఉగ్రం. మే 12న కస్టడీ, హనుమాన్ సినిమాలు. 18న అన్నీ మంచి శకునములే , 19న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, బెదురులంక సినిమాలు రానున్నాయి.




