AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashu Reddy: ఆస్పత్రి పాలైన బిగ్‌బాస్ బ్యూటీ.. కనీసం నడవలేని స్థితిలో అషూ రెడ్డి.. కారణమిదే!

టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా జూనియర్‌ సమంతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అషూ రెడ్డి. ఇదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి మరింత మంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది. బిగ్‌బాస్ ఓటీటీల సీజన్‌లోనూ సందడి చేసిన

Ashu Reddy: ఆస్పత్రి పాలైన బిగ్‌బాస్ బ్యూటీ.. కనీసం నడవలేని స్థితిలో అషూ రెడ్డి.. కారణమిదే!
Ashu Reddy
Basha Shek
|

Updated on: Apr 03, 2023 | 1:40 AM

Share

టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా జూనియర్‌ సమంతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అషూ రెడ్డి. ఇదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి మరింత మంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది. బిగ్‌బాస్ ఓటీటీల సీజన్‌లోనూ సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ కొన్ని టీవీ షోల్లోనూ పాల్గొంది. అన్నిటికంటే ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో అషూ రెడ్డి చేసిన బోల్డ్‌ ఇంటర్వ్యూ ఆమెను సోషల్‌ మీడియాలో బాగా ప్రోజెక్ట్‌ చేసింది. నిజం చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యన ఎక్కువగా విదేశీ టూర్లలో బాగా కనిపిస్తోంది అషూ రెడ్డి. ఇటీవలే దుబాయ్‌, అమెరికా వెకేషన్స్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. ఇలా నిత్యం తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటలతో సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేసే అషూ రెడ్డి తాజా పోస్ట్‌ వైరల్‌గా మారింది. దీనిలో బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆస్పత్రిలో ఉండడంతో.. అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం టూర్లు, వెకేషన్లతో ఎంతో చలాకీగా ఉండే అషూ రెడ్డి ఆస్పత్రిలో చేరింది. చేతికి సెలైన్‌ పైప్‌తో, ఆస్పత్రి బెడ్‌ మీద ఉన్న అషూ రెడ్డి ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు, నెటిజనులు.. ‘అషూ రెడ్డికి ఏమైంది? ఆస్పత్రిలో ఎందుకు చేరింది? ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? అని ఆరాతీస్తున్నారు. దీనిపై స్పందించిన అషూ తాను ఇప్పుడు త్వరగా కోలుకుంటున్నాను.. కంగారేం లేదు అని చెప్పుకొచ్చింది అషూ రెడ్డి. అయితే సమస్యమేంటో మాత్రం తెలపలేదు. ఇదిలా ఉంటే టీవీ షోలతో పాటు అప్పుడప్పుడూ వెండితెరపైనా మెరుస్తోంది. కొన్నిరోజుల క్రితం ఫోకస్ అనే సినిమాలో నటించిన అషూరెడ్డి మరికొన్ని చిత్రాల్లోనూ కనిపించనుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Ashu Reddy (@ashu_uuu)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..