Samantha: సమంత పోస్ట్ చేసిన ఫోటోకు 10 గంటల్లోనే 14 లక్షల లైకులు..! మీరు ఓ లుక్కేయండి..
Samantha: సెలబ్రిటీలు ఏం చేసినా సోషల్ మీడియాలో అది వార్త అయిపోతుంది. తాజాగా అక్కినేని వారి కోడలు, హీరోయిన్ సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.
Samantha: సెలబ్రిటీలు ఏం చేసినా సోషల్ మీడియాలో అది వార్త అయిపోతుంది. తాజాగా అక్కినేని వారి కోడలు, హీరోయిన్ సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఈ ఫొటోకు 10 గంటల్లోనే 14 లక్షల లైకులు రావడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు ఎంత క్రేజ్ ఉందో తెలుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్ట్ ఏంటి.. దాని గురించి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సమంత తన పెంపుడు కుక్కలతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. రిలాక్స్‌గా ఉండి ఒక చిన్న కుక్కపిల్లను ఒడిలో కూర్చోబెట్టుకుని దానినే చూస్తూ ఉండటం మనం గమనించవచ్చు. ఫోటో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది. “ఇంతకు ముందే ఇళ్లు మొత్తం శుభ్రం చేసి కాఫీ తాగాను. కానీ ఐదు నిమిషాలు కాకుముందే నా కుక్కపిల్ల మళ్లీ ఇంటి వాతావరణాన్ని పాడు చేసింది. దీంతో కాఫీ ఎనర్జీ మొత్తం వేస్ట్ అయింది” అంటూ చెబుతోంది. ఫొటోలో తను పెంచుకుంటున్న రెండు కుక్కలను మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం విశేషం.
ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే శాకుంతలం సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. తమిళంలో కాతు వాక్కుల రెండు కాదల్ సినిమా షూటింగ్ లో ఉండగా మరోవైపు బుల్లితెరపై హోస్ట్, వెబ్ సిరీస్ లపై చర్చకు జరుగుతున్నాయి. మరోవైపు సమయం చిక్కినప్పుడల్లా సమంత తన వుమెన్ క్లాతింగ్ బ్రాండ్ ‘సాకీ’ దుస్తులు, స్కూలింగ్ బిజినెస్ పై ప్రచారమూ చేసుకుంటోంది.
View this post on Instagram