AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ రోజు చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఒక్కడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న మహేష్.. పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ రోజు చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా..
Mahesh
Rajeev Rayala
|

Updated on: Sep 23, 2021 | 11:55 AM

Share

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఒక్కడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న మహేష్.. పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ రెండు సినిమాలు మహేష్‌ను టాప్ పొజిషన్‌లో నిలబెట్టాయి. ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ కెరియర్‌లో మైల్ స్టోన్‌గా నిలించింది సినిమా దూకుడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మహేష్ అభిమానులకు కావాల్సినంత స్టఫ్‌ను దూకుడు సినిమాతో అందించాడు శ్రీను వైట్ల. ఈ సినిమాలో మహేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎమ్మెల్యే‌గా రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. సమంత మహేష్ సరసన నటించి మెప్పించింది. 2011 సెప్టెంబర్ 23న విడుదల అయిన దూకుడు సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంది.

నేటితో ఈ మూవీ 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు హంగామా చేస్తున్నారు. దూకుడు కు సంబంధించిన ఫొటోలు వీడియోలు.. విశేషాలు  షేర్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ.. ముందుగా నేను మహేశ్ బాబుతో ఒక దేశభక్తి సినిమాను చేయాలనుకున్నాను. కానీ అది కుదరలేదు.. ఒకసారి మాటల సందర్భంలో మహేశ్ ను ఎమ్మెల్యేగా చూపిస్తే ఎలా ఉంటుందనే ప్రస్తావన వచ్చింది. అప్పుడు తయారైన కథనే ‘దూకుడు’. ఇక ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్ర చాలా కీలకం ముందుగా ఆ పాత్రకు శ్రీహరిని అనుకున్నాము. కానీ అనుకోని కారణాల వలన అది కుదరలేదు అన్నారు. మొత్తానికి దూకుడు దశాబ్ది ఉత్సవాలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జరుగుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raj Tarun’s Anubhavinchu Raja: రామ్ చరణ్ వదిలిన రాజ్ తరుణ్ టీజర్.. ఆకట్టుకుంటున్న అనుభవించు రాజా…

Naga Chaitanya: రానా బాటలో అక్కినేని యంగ్ హీరో.. ఛాలెంజింగ్ రోల్‌కు సై అంటున్న చైతన్య..

Easwari Rao: ఆ సినిమా చూసి శేఖర్ కమ్ముల కాల్ చేసి సినిమా ఆఫర్ చేశారు.. ఈశ్వరీరావు ఆసక్తికర కామెంట్స్