Tollywood: వారసుడు వచ్చేశాడు.. సంతోషంలో టాలీవుడ్ యంగ్ హీరో.
టాలీవుడ్ యంగ్ నటుడు నవీన్ చంద్ర పుత్రోత్సహంతో ఉన్నారు. ఆయన భార్య గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నవీన్ చంద్ర స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. చిన్నారి పదాన్ని ముద్దాడుతు దిగిన ఫొటోను పోస్ట్ చేసిన నవీన్ చంద్ర తన..
టాలీవుడ్ యంగ్ నటుడు నవీన్ చంద్ర పుత్రోత్సహంతో ఉన్నారు. ఆయన భార్య గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నవీన్ చంద్ర స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. చిన్నారి పదాన్ని ముద్దాడుతు దిగిన ఫొటోను పోస్ట్ చేసిన నవీన్ చంద్ర తన సంతోషాన్ని అభిమానలుతో పంచుకున్నారు. ఈ ఫొటోతో పాటు ‘మాకు బాబు పుట్టాడు’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చారు నవీన్ చంద్ర.
దీంతో ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే నవీన్ చంద్ర భార్య పేరు ఒర్మా. వీరిద్దరికీ 2022లో వివాహం జరిగింది. ఇక తాజాగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజు తన భార్య ఓర్మా ప్రగ్నెంట్ అని ప్రకటించారు నవీన్ చంద్ర. తన భార్యతో కలిసి బేబీ బంప్ ఫోటోలు కూడా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
View this post on Instagram
ఇక నవీన్ చంద్ర కెరీర్ విషయానికొస్తే.. టాలీవుడ్లో మంచి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు నవీన్ చంద్ర. ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న నవీన్ చంద్ర ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలతో పాటు, తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..