శ్రీముఖి నటిస్తున్న క్రేజీ అంకుల్స్ ట్రైలర్ విడుదల.. అదరగొడుతున్న ముగ్గురు అంకుల్స్ ఎవరో తెలుసా?

ప్రముఖ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ అంకుల్స్‌’ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ఎన్నో స్టేజి షోల ద్వారా అదరగొట్టిన

శ్రీముఖి నటిస్తున్న క్రేజీ అంకుల్స్ ట్రైలర్ విడుదల.. అదరగొడుతున్న ముగ్గురు అంకుల్స్ ఎవరో తెలుసా?
Follow us
uppula Raju

|

Updated on: Dec 27, 2020 | 6:42 AM

ప్రముఖ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ అంకుల్స్‌’ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ఎన్నో స్టేజి షోల ద్వారా అదరగొట్టిన శ్రీముఖి చాలా రోజుల తర్వాత పూర్తినిడివి ఉన్న సినిమాలో నటించారు. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో రాజా రవీంద్ర, మనో, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. దీంతో ఇప్పడు ఈ ట్రైలర్ వైరల్‌గా మారుతోంది. ట్రైలర్‌లో ‘భార్యను మోసం చేస్తే చంపేస్తా’ ‘ఈ అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు రాములు ఉన్నారు’ అన్న మాటలు ఆసక్తిగా మారాయి. ఆ ముగ్గురు చేసిన పనేంటి. అసలు శ్రీముఖి వారి జీవితాల్లోకి ఎందుకు వెళ్లిందనేదే ప్రధానంగా సినిమా ఇతివృత్తం. కాగా కామెడీ నేపథ్యంలో సినిమా కొనసాగుతుంది కనుక కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. మరి ఆ ముగ్గురు అంకుల్స్ చేసిన అల్లరి ఏంటో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.