Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ తెలుగులో పాడిన పాటలు కేవలం రెండు మాత్రమే.. అవేంటో తెలుసా.?

Lata Mangeshkar: ఎన్నో ఏళ్ల పాటు ఇండియన్‌ సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఆ మధుర గానం నేడు దివికేగింది. ఎంతో మంది అభిమానులను విషాదంలో నింపి లతా మంగేష్కర్‌ నింగికేగారు. అయితే ఆమె గొంతు నుంచి జాలువారిన మధుర గానాలు..

Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ తెలుగులో పాడిన పాటలు కేవలం రెండు మాత్రమే.. అవేంటో తెలుసా.?

Edited By:

Updated on: Feb 06, 2022 | 4:37 PM

Lata Mangeshkar: ఎన్నో ఏళ్ల పాటు ఇండియన్‌ సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఆ మధుర గానం నేడు దివికేగింది. ఎంతో మంది అభిమానులను విషాదంలో నింపి లతా మంగేష్కర్‌ నింగికేగారు. అయితే ఆమె గొంతు నుంచి జాలువారిన మధుర గానాలు శాశ్వతంగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. భాషతో సంబంధం లేకుండా లతాను అభిమానిస్తుంటారు. లతాకు తెలుగులోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే తెలుగులో లతా చాలా తక్కువ సంఖ్యలో పాటలు పాడారు. తన మొత్తం కెరీర్‌లో లతా కేవలం మూడు అంటే మూడు పాటలు మాత్రమే స్ట్రెయిట్‌ తెలుగు మూవీస్‌లో పాడారు. అయితే వీటితో పాటు హిందీ డబ్బింగ్‌ సినిమా ద్వారా మరో మూడు పాటల్లో లత తన గొంతు సవరించారు. లతా మంగేష్కర్‌ ఇప్పటి వరకు తెలుగులో పాడిన పాటలు ఇవే..

లతా మంగేష్కర్‌ తెలుగులో పాడిన తొలి పాట ‘సంతానం’ చిత్రంలోని ‘నిదురపోరా తమ్ముడా’. 1955లో వచ్చిన ఈ సినిమాలో ఏఎన్నార్‌, సావిత్ర జంటగా నటించారు. ఇక లతా తెలుగులో పాడిన రెండో పాట 1988లో నాగార్జున, శ్రీదేవి జంటగా తెరకెక్కిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘ఆఖరి పోరాటం’లోని ‘తెల్లచీరకు’ పాటను ఆలపించారు.

 

ఇదిలా ఉంటే లతా తెలుగులో స్ట్రెయిట్‌ మూవీస్‌తో పాటు కొన్ని హిందీ డబ్బింగ్‌ సినిమాల్లో కూడా తెలుగులో పాడారు. హిందీలో వచ్చిన చాందిని సినిమాను తెలుగులో శ్రీదేవీ పేరుతో డబ్‌ చేశారు. ఈ సినిమాలో లతా మొత్తం మూడు పాటలు పాడారు. ఈ పాటల విషయానికొస్తే ‘మోగుతున్నాయి గాజులు’, ‘నగరాలకు తల నగరమిది’, ‘నీవు నేను ఊహల్లో’.

Also Read: Lata Mangeshkar: గాయని లతా మంగేష్కర్ కన్నుమూత.. భారతరత్న పురస్కార గ్రహీత గానకోకిల అరుదైన చిత్రాలు..

Malli Modalaindi: విడాకుల గురించి కథ ఉంటుంది అనగానే నచ్చేసింది.. హీరో సుమంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Boney Kapoor: భారీ ప్రాజెక్టులతో ఫుల్ జోష్ లో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్.. లైన్‌లో ఏకంగా ఐదు సినిమాలు