KGF 2: కేజీఎఫ్ 2 విడుదల తేదీ వాయిదా పడనుందా..? క్లారిటీ ఇచ్చేసిన చిత్ర యూనిట్..
KGF 2: కేజీఎఫ్ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక కన్నడ సినిమా దేశవ్యాప్తంగా ఇంతటి సంచలనం సృష్టించడడం బహుశా ఇదే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ నీల్...
KGF 2: కేజీఎఫ్ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక కన్నడ సినిమా దేశవ్యాప్తంగా ఇంతటి సంచలనం సృష్టించడడం బహుశా ఇదే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో, యశ్ (Yash) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సృష్టించిన సంచనలం అంతా ఇంతకాదు.. గోల్డ్ మైనింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ముందు సంచలనాన్ని సృష్టించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్-2 (KGF Chapter 2) రానున్న విషయం తెలిసిందే. నిజానికి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా విడుదలకు దూరంగా ఉంటూ వస్తోంది. పలుసార్లు విడుదల తేదీన మార్చుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే గత కొన్ని రోజుల క్రితం ఈ సినిమా విడుదలపై పలు రకాల వార్తలు హల్చల్ చేశాయి. కేజీఎఫ్2లో ఒక పాట ఆశించిన స్థాయిలో రాలేదని, దీంతో పాటను మళ్లీ చిత్రీకరిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే సినిమా అనున్న తేదీకి విడుదలయ్యే అవకాశాలు లేవంటూ నెట్టింట వార్తలు సందడి చేశాయి. తాజాగా చిత్ర యూనిట్ ఈ వార్తలను ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లో రాఖీ భాయ్ ఏప్రిల్ 14న థియేటర్లలోకి రానున్నాడని క్లారిటీ ఇచ్చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను దేశంలోని అన్ని భాషలతో పాటు ఇంగ్లిష్‌లోనూ విడుదల చేస్తుండడం విశేషం. మరి కేజీఎఫ్-2 ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇంకెలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
Also Read: Vijay Deverakonda: రష్మికతో ప్రేమ, పెళ్లి వార్తలపై తన మార్క్ ట్వీట్ వేసిన రౌడీ హీరో.. ఫుల్ క్లారిటీ
Bank Holidays In March: మార్చి నెలలో 13 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే?