Telugu Serials: ఆదరణ కోల్పోతున్న గుప్పెడంత మనసు.. ఫస్ట్ ప్లేస్‌లో దూసుకుపోతున్న బ్రహ్మముడి.. టాప్ 5 సీరియల్స్ ఏమిటంటే?

|

Apr 01, 2023 | 1:48 PM

మార్చి 31 వ తేదీ వరకూ నమోదైన టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం ఇప్పుడు తెలుగులో టాప్ సీరియల్స్  ఎక్కువ భాగం స్టార్ మా లో ప్రసారం అయినవే కావడం విశేషం. నెక్స్ట్ జీ తెలుగు లో ప్రసారం అవుతున్న కొన్ని సీరియల్స్ టాప్ 5 ప్లేస్ కోసం పోటీపడుతున్నాయి.

Telugu Serials: ఆదరణ కోల్పోతున్న గుప్పెడంత మనసు.. ఫస్ట్ ప్లేస్‌లో దూసుకుపోతున్న బ్రహ్మముడి.. టాప్ 5 సీరియల్స్ ఏమిటంటే?
Telugu Serials
Follow us on

బుల్లి తెరపై ఎన్నిరకాల ప్రోగ్రామ్స్, వినోద కార్యక్రమాలు వచ్చినా సీరియల్స్ స్థానం ఎప్పుడూ పదిలమే.. సినిమాలు, సిరీస్ లు, ఆటలు, పాటలు ఇన్నా ఎన్ని ప్రసారం అయినా మహిళ ఆదరణను సొంతం చేసుకున్నవి సీరియల్స్ మాత్రమే.. ఎందుకంటే కొంచెం కంటెంట్ డిఫరెంట్ గా ఉండి.. కుటుంబ కథ అయి ఉంటె చాలు  లేడీస్ ను ఆకట్టుకుంటాయి. అటువంటి సీరియల్స్ కు మహిళల  ఆదరణ ఎప్పటికీ పదిలం.. ఎన్ని ఏళ్ళు ప్రసారం చేసినా ఆ సీరియల్ ను మహిళలు ఆదరిస్తూనే ఉంటారు. అందుకు ఉదాహరణ కార్తీక దీపం అని చెప్పవచ్చు.. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్లకు ఇప్పటికీ సీరియల్స్ తోనే కాలక్షేపం. అందుకే బుల్లి తెరపై ప్రసారం అయ్యే సీరియల్స్  భారీగా టీఆర్పీ రేటింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి. అయితే వారం వారం ఈ రేటింగ్స్ మారుతూ ఉంటాయి.

తాజాగా మార్చి 31 వ తేదీ వరకూ నమోదైన టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం ఇప్పుడు తెలుగులో టాప్ సీరియల్స్  ఎక్కువ భాగం స్టార్ మా లో ప్రసారం అయినవే కావడం విశేషం. నెక్స్ట్ జీ తెలుగు లో ప్రసారం అవుతున్న కొన్ని సీరియల్స్ టాప్ 5 ప్లేస్ కోసం పోటీపడుతున్నాయి. అయితే సీరియల్స్ లో సంచలనం సృష్టించి కొన్నేళ్లు టాప్ లో దూసుకెళ్లిన జెమినీ టీవీలో ఏ ఒక్క సీరియల్ టాప్ ప్లేస్ కోసం పోటీపడలేక పోతోంది.

టాప్ సీరియల్ గా తాజా టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం స్టార్ మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మ ముడి ఫస్ట్ ప్లేస్ ను దక్కించుకుంది. 11. 41 రేటింగ్ తో మొదటి ప్లేస్ లో దూసుకుపోతోంది. ఇటీవల ప్రారంభమైన ఈ సీరియల్ కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ వారం 9.97 రేటింగ్ తో రెండో స్థానంలో అనూహ్యంగా స్టార్ మాలోనే ప్రసారం అవుతున్న కృష్టా ముకుందా మురారి సీరియల్  దక్కించుకుంది. మూడు, నాలుగు, ఐదు స్థానాలను వరసగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఇంటిటి గ్రహాలక్ష్మి, గుప్పెడంత మనసు, మల్లి సీరియల్స్ దక్కించుకున్నాయి.

ఇవి కూడా చదవండి

అనంతరం జీ తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్స్ త్రినయని, ప్రేమ ఎంత మధురం, పడమటి సంధ్యా రాగం వంటి సీరియల్స్ తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొత్తం మీద ఈ వారం కూడా ప్రేక్షాధారణ పొందిన సీరియల్స్ స్టార్ మా, జీ తెలుగువి కావడం విశేషం.. అయితే ప్రతి వారం ఈ టీఆర్పీ రేటింగ్ మారుతూ ఉంటాయి.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..