నయన్ పెళ్లి ఫిక్స్..! ఎక్కడో తెలుసా..?

స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయట. త్వరలోనే వీరిద్దరూ ‘డెస్టినేషన్ వెడ్డింగ్‌’ ద్వారా ఒక్కటవబోతున్నారు. గత కొంత కాలంగా.. వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ బంధం ఇప్పుడు పెళ్లిగా మారనుంది. ఈ ఏడాది చివరిలోనే వీరి వివాహం ఉందని.. అది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్‌ అని సమాచారం. అలాగే.. వీరు తమ పెళ్లిని విదేశాల్లో ఘనంగా చేసుకోబోతున్నారని మరో టాక్ వినిపిస్తోంది. కాగా.. టాలీవుడ్, […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:03 pm, Wed, 2 October 19
నయన్ పెళ్లి ఫిక్స్..! ఎక్కడో తెలుసా..?

స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయట. త్వరలోనే వీరిద్దరూ ‘డెస్టినేషన్ వెడ్డింగ్‌’ ద్వారా ఒక్కటవబోతున్నారు. గత కొంత కాలంగా.. వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ బంధం ఇప్పుడు పెళ్లిగా మారనుంది. ఈ ఏడాది చివరిలోనే వీరి వివాహం ఉందని.. అది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్‌ అని సమాచారం. అలాగే.. వీరు తమ పెళ్లిని విదేశాల్లో ఘనంగా చేసుకోబోతున్నారని మరో టాక్ వినిపిస్తోంది. కాగా.. టాలీవుడ్, తమిళ స్టార్స్, ప్రముఖ యాక్టర్స్, స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరగబోతోందట. అయితే.. వీరి పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు కానీ.. తాజాగా.. నయన్ షేర్ చేసిన పిక్స్ చూస్తుంటే మాత్రం.. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోందని ఖాయమనిపిస్తోంది.

తాజాగా.. నయన్.. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘సైరా నరసింహా రెడ్డి’లో ప్రధాన పాత్ర పోషించారు. ఈ మంచి టాక్‌ను కూడా సొంతం చేసుకుంది. అలాగే.. విజయ్‌తో ‘బిగిల్’ అనే చిత్రంలో కూడా నటించింది నయన్. అంతేకాకుండా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘దర్బార్’లో కూడా నటిస్తోంది. మొత్తానికి చేతుల నిండా సినిమాలతో.. బిజిబజీగా ఉంది నయనతార.