బిగ్ బాస్ ఏడో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో 11 వారంలోకి అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ హౌజ్‌లోనూ దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ సినిమా సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. ఈ సందర్భంగా టాప్-5లో ఎవరెవరు ఉంటారో కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హౌజ్‌లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. టాప్-5లో శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ నిలుస్తారని తెలుస్తోంది. దీపావళి రోజున కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్, టాలీవుడ్ సెలబ్రిటీల అభిప్రాయాల్లో కూడా ఎక్కువగా వీరి పేర్లే వినిపించాయి. బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన ప్రతి ఒక్కరూ శివాజీని టాప్-5 లిస్టులో ఉంచారు. అతనికి మొత్తం 11 ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు 9 ఓట్లు పోలయ్యాయి. అలాగే ప్రిన్స్ యావర్‌కు 7 ఓట్లు, అమర్ దీప్ చౌదరికి 6 ఓట్లు, ప్రియాంక జైన్‌కు 6 ఓట్లు, గౌతమ్‌కు 5 ఓట్లు పడ్డాయి. అంటే అమ్మాయిల్లో ప్రియాంక జైన్ మాత్రం టాప్-5 లిస్టులో ఉండనుందని తెలుస్తోంది.
కాగా సినీ తారలపై నిత్యం సర్వేలు నిర్వహిస్తూ వార్తల్లో నిలిచే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై కూడా సర్వే నిర్వహించింది. ఈ సందర్బంగా నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించిన మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్టును రిలీజ్ చేసింది. ఇందులో ఎప్పటిలాగే బిగ్ బాస్ పెద్దన్న శివాజీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పేరు ఉంది. ఇక మూడో స్థానంలో అమర్ దీప్ చౌదరి కొనసాగుతున్నాడు. ఇక నాలుగో స్థానంలో గౌతమ్ కృష్ణ పేరు ఉండగా.. ఐదో స్థానంలో మోనిత శోభాశెట్టి ఉంది. మొత్తానికి ప్రస్తుతం బిగ్‌బాస్ హౌజ్‌లో శివాజీ ఆధిపత్యమే నడుస్తోంది. దీంతో అతనే ఏడో సీజన్ టైటిల్ విన్నర్‌గా నిలుస్తాడని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..