Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే వేదికపై సమంత, అక్కినేని అమల..రోజా, రమ్యకృష్ణ, జయసుధ, జయప్రద కూడా.. మరికొన్ని గంటల్లో ఈ ఛానెల్‌లో చూడొచ్చు

నాగచైతన్యతో విడాకుల తర్వాత మొదటిసారి సమంత, అక్కినేని అమల ఒకే వేదికను పంచుకోనున్నారు. వీరితో పాటు ఐశ్వర్యా రాజేష్, రోజా, రమ్యకృష్ణ, జయప్రద, జయసుధ, సుకుమార్, అనిల్ రావిపూడి. .ఇలా ఎందరో వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు సందడి చేసిన ఈ ప్రోగ్రాం మరికొన్ని గంటల్లో ప్రసారం కానుంది.

ఒకే వేదికపై సమంత, అక్కినేని అమల..రోజా, రమ్యకృష్ణ, జయసుధ, జయప్రద కూడా.. మరికొన్ని గంటల్లో ఈ ఛానెల్‌లో చూడొచ్చు
ZEE Telugu Aspara Awards 2025
Basha Shek
|

Updated on: May 24, 2025 | 1:16 PM

Share

ప్రారంభించిన రోజునుంచీ ప్రతిభావంతులైన కళాకారులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు, చిత్రబృందం అచంచలమైన అంకితభావంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ తిరుగులేని ఛానల్గా ఎదిగింది జీ తెలుగు. మే 18, 2025 నాటికి విజయవంతంగా ఇరవై సంవత్సరాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలకు ప్రతిష్ఠాత్మక జీ తెలుగు అప్సర అవార్డులను ప్రదానం చేసింది. వెండితెర, బుల్లితెర తారల సందడితో వైభవంగా జరిగిన జీ తెలుగు అప్సర అవార్డ్స్ ఈ శనివారం, మే 24, 2025 సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో ప్రసారం కానుంది! అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ యాంకర్స్ సుధీర్, రవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో డ్రామా జూనియర్స్ పిల్లలు చిరంజీవి, బాలకృష్ణ గెటప్‌లో వేదికపైకి వచ్చి ప్రముఖ నటి రోజాకు అవార్డు అందించారు. జయప్రద, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడితో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని సీన్స్ని రీక్రియేట్ చేశారు. అమల అక్కినేని రవి, రోజాతో కలిసి డాన్స్ చేయడమే కాకుండా, జంతు సంరక్షణ, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ గురించి పలు విషయాలు పంచుకున్నారు. జయసుధకు అభిమానులు ఆటోగ్రాఫ్‌లతో అలంకరించిన చీరను బహుమతిగా ఇచ్చారు.

రమ్యకృష్ణ నటించిన ప్రముఖ పాత్రలతో ఓ చక్కని ప్రదర్శన ఇచ్చారు. మంచు లక్ష్మీ తన డాన్స్తో అలరించగా, కోర్ట్ సినిమా ఫేమ్ శ్రీదేవి తన తల్లి గురించి పంచుకున్న విషయాలు అందరినీ కంటతడి పెట్టించాయి. రవి, సుధీర్ కలిసి డైరెక్టర్ సుకుమార్‌ను పలు సరదా ప్రశ్నలతో ఆటపట్టించారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తన తండ్రి AI చిత్రాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. సమంత 15 ఏళ్ల సినీ ప్రయాణాన్ని అద్భుతమైన ప్రదర్శన, కేక్ కట్టింగ్‌తో ఈ వేదికపై ఘనంగా జరుపుకున్నారు. 114 ఏళ్ల పద్మశ్రీ తిమ్మక్క ఎనభై సంవత్సరాల్లో 8000 చెట్లు నాటినందుకుగానూ ఈ వేదికపై సన్మానించారు. వ్యాపారంలో విజయవంతంగా రాణిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ ప్రతిష్టాత్మక మహిళా మార్గదర్శి అవార్డు అందుకున్నారు. జీ తెలుగు తారలు చేసి నవదుర్గ ప్రదర్శన అద్భుతంగా ఆకట్టుకుంది. మోనికా రెబా, హెబా పటేల్, శ్రీదేవి, రోషన్ నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఘనంగా జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులైన సంయుక్త మీనన్, మీనాక్షి చౌదరి, మురళీ మోహన్, అన్నపూర్ణ, స్వప్న దత్, ప్రియాంక దత్, జీవిత రాజశేఖర్, శివాని రాజశేఖర్, సుమ కనకాల, కోన వెంకట్, నిహారిక కొణిదెల, అనసూయ, డైరెక్టర్ నందిని రెడ్డి, రజిత, ప్రగతితో పాటు మరికొందరు నటీనటులు పాల్గొని సందడి చేశారు. హృదయాలను హత్తుకునే క్షణాలతో ఈ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. డాన్స్ ప్రదర్శనలు, అవార్డ్స్ అందుకున్న అనంతరం పలువురు ప్రముఖుల భావోద్వేగభరిత ప్రసంగాలు ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

అంగరంగ వైభవంగా జరిగిన జీ తెలుగు అప్సర అవార్డ్స్ 2025, ఈ శనివారం మీ జీ తెలుగులో, మీరూ మిస్ అవకుండా చూడండి!

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.