బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ నుంచి హాట్ బ్యూటీ రతికా రోజ్ ఎలిమినేట్ అయిపోయింది. షో ప్రారంభం నుంచి టైటిల్ ఫేవరేట్‌గా భావించిన ఆమె అనూహ్యంగా హౌజ్ నుంచి బయటకు రావడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఆదివారం (అక్టోబర్ 1) నాటి ఎపిసోడ్‌లో రతికను ఎలిమినేట్ చేస్తున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ హౌజ్ నుంచి బయటకు వచ్చిందీ అందాల తార. కాగా బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ కావడంపై రతిక నుంచి ఫస్ట్ రియాక్షన్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టిందామె. ‘ డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్’ అనే సామెతను గుర్తుచేసిన ఆమె షోలో తనను చూసి మీరు ఓ అంచనాకు రావొద్దు. బిగ్ బాస్ హౌజ్‌లో చూసిన దాని కంటే మీకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది’ అని రాసుకొచ్చింది. ఇదే సందర్భంగా తనకు సపోర్టుగా నిలిచిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది రతిక. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరలవుతోంది. ఈ పోస్ట్ బట్టి చూస్తే తన విషయంలో బిగ్‌బాస్ అన్యాయం చేసినట్లు రతిక ఫీలవుతుందని అర్థమవుతోంది. బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో మొత్తం 14 కంటెస్టెంట్లు అడుగుపెట్టింది. అయితే షో ప్రారంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది రతికా రోజ్. తన గ్లామర్ లుక్స్‌తో షోను రక్తికట్టించింది. బిగ్‌బాస్ హౌజ్‌కు కావాల్సిన కంటెంట్‌ను కూడా బాగానే అందించింది. దీంతో కచ్చితంగా టాప్-5లో ఉంటుందని చాలామంది భావించారు. నెట్టింట కూడా ఈ అందాల తారకు ఆదరణ బాగా పెరిగింది.
అయితే షో సాగే కొద్దీ పూర్తిగా మారిపోయింది రతిక. తన ఆటతీరుతో విరక్తి తెప్పించింది. ఆట ఆడే బదులు.. మనుషుల ఎమోషన్స్‌తో ఆడుకుంటుందన్న కామెంట్లు వినిపించాయి. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌పై ప్రేమను ఒలకబోసి వారితోనే గొడవలకు దిగడం జనాలకు అసలు నచ్చలేదు. దీంతో వెన్నుపోటు పొడవడంతో కట్టప్పను మించి పోయిందన్నారు ఆడియెన్స్. వీరి విషయంలోనే కాదు చిన్న చిన్న విషయాలకు కంటెస్టెంట్స్‌తో గొడవలు పడుతూ వచ్చింది. దీంతో ఓటింగ్ శాతమూ తగ్గిపోయింది. ఇదే సమయంలో నాలుగో పవరాస్త్ర కోసం పెట్టిన టాస్కుల్లోనూ రతిక పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో నాలుగో వారమే ఎలిమినేట్ అయ్యి హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది.
రతికా రోజ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.