Bigg Boss: బిగ్ బాస్‌లోకి మహాలక్ష్మి భర్త రవీందర్.. ఆడియెన్స్‌ను ఏ మేర మెప్పిస్తాడో మరి?

|

Oct 07, 2024 | 8:11 AM

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తోంది. తెలుగుతో పాటు ప్రముఖ భాషల్లోనూ ఈ రియాలిటీ షో బుల్లితెరపై సందడి చేస్తోంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుండగా, కన్నడలో వారం క్రితమే ఈ రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక ఆదివారం (అక్టోబర్ 06) బిగ్‌బాస్‌..

Bigg Boss: బిగ్ బాస్‌లోకి మహాలక్ష్మి భర్త రవీందర్.. ఆడియెన్స్‌ను ఏ మేర మెప్పిస్తాడో మరి?
Ravinder Chandrasekharan
Follow us on

 

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తోంది. తెలుగుతో పాటు ప్రముఖ భాషల్లోనూ ఈ రియాలిటీ షో బుల్లితెరపై సందడి చేస్తోంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుండగా, కన్నడలో వారం క్రితమే ఈ రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక ఆదివారం (అక్టోబర్ 06) బిగ్‌బాస్‌ తమిళ్ సీజన్-8 అట్టహాసంగా ప్రారంభమైంది. గత ఏడు సీజన్లకు కమల్ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వచ్చారు. తనదైన శైలిలో జోకులు వేస్తూ హౌస్ ను రక్తి కట్టించారు. కంటెస్టెంట్స్‌ అందరినీ బిగ్ బాస్ ఆడియెన్స్ కు పరిచయం చేశారు. ఈ సీజన్ లో మొత్తం 18 మంది కంటెస్టెంట్స్‌ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం హౌస్ లోకి అడుగు పెట్టారు. కాగా ఈ సారి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల లిస్టులో ప్రముఖ తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ కూడా ఉన్నారు. గతంలోప్రముఖ బుల్లితెర నటి మహాలక్ష్మిని వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారాయన. వీరిద్దరి వివాహంపై అప్పట్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మహాలక్ష్మి డబ్బు కోసమే రవీందర్‌ను పెళ్లి చేసుకుందంటూ నెటిజన్లు నటిని బాగా ట్రోల్‌ చేశారు. ఇక రవీందర్‌ భారీకాయంపై కూడా నెగెటివ్ కామెంట్స్ చేశారు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా తమ మ్యారేజ్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారీ లవ్లీ కపుల్. ఆ మధ్యన రవీందర్ ఒక ఛీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. దీంతో మహాలక్ష్మి అతనితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అవన్నీ రూమర్లే అని తేలిపోయాయి. సోషల్ మీడియాలో ఈ దంపతులు ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు రవీందర్. మరి వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన ఆయన బిగ్ బాస్ ఆడియెన్స్ ను ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి.

18 కంటెస్టెంట్లలో ఒకడిగా..

భార్య మహాలక్ష్మితో రవీందర్ చంద్రశేఖరన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.