Pradeep Machiraju KTUC 5: తొలిసారిగా బుల్లితెర పై పవన్ కళ్యాణ్.. ప్రదీప్ తో సందడి చేయనున్న వకీల్ సాబ్..

ఇప్పటికే నాలుగు సీజన్లు ముగించుకున్న కొంచెం టచ్ లో ఉంటే చెప్తా 5వ సీజన్ కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ జీ  తెలుగులో ప్రసారమయ్యే ఈ షోకి ప్రదీప్ యాంకర్ కమ్ ప్రొడ్యూసర్..

Pradeep Machiraju KTUC 5:    తొలిసారిగా బుల్లితెర పై పవన్ కళ్యాణ్..  ప్రదీప్ తో సందడి చేయనున్న వకీల్ సాబ్..
Follow us

|

Updated on: Feb 04, 2021 | 12:29 PM

Pradeep Machiraju KTUC 5: ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై అత్తాకోడళ్లు షో తో యాంకర్‌గా అడుగు పెట్టి బుల్లి తెర ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరించాడు. అలా బుల్లి తెరపై మొదలైన ప్రదీప్ జర్నీ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. సుమ తర్వాత యాంకర్‌గా ఆ రేంజ్ లో ఆదరణ సొంతం చేసుకున్నాడు. ఓ వైపు షో లకు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు కొంచెం టచ్ లో ఉంటె చెబుతా షో ద్వారా ప్రొడ్యూసర్ గా మారాడు. అక్కడ కూడా సక్సెస్ అందుకున్నాడు.. ఇప్పటికే నాలుగు సీజన్లు ముగించుకున్న కొంచెం టచ్ లో ఉంటే చెప్తా 5వ సీజన్ కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ జీ  తెలుగులో ప్రసారమయ్యే ఈ షోకి ప్రదీప్ యాంకర్ కమ్ ప్రొడ్యూసర్..ఈ సీజన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను “కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా” షోకి గెస్ట్‌గా తీసుకుని రావడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నానని ప్రదీప్ చెప్పాడు. ఆయన్ని కలిసి ఇప్పటికే మాట్లాడటం జరిగిందన్నాడు.

ఓ వైపు వరస సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సమయం చూసుకుని తన షో కి రావడం చాలా గ్రేట్ అంటూ ప్రదీప్ చెప్పాడు.. ఇదే తన షోకి బిగ్గెస్ట్ ఎచీవ్ మెంట్ అని తెలిపారు. త్వరలో పవన్ కళ్యాణ్‌ని ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’ షోలో చూడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు యాంకర్ ప్రదీప్. అయితే 2017లో కూడా సీజన్ 3కి పవన్ కళ్యాణ్ వస్తున్నట్టు చెప్పారు ప్రదీప్. మరి ఈసారైనా ప్రదీప్ ప్రయత్నాలు ఫలించి ప్రదీప్ షో కి వకీల్ సాబ్ వస్తాడేమో చూడాలి మరి..

ఇక నాలుగు సీజన్లలో సమంత, కాజల్, ఛార్మి, అనుష్క శ్రుతిహాసన్ వంటి స్టార్ హీరోయిన్లతో పాటు నాగ చైతన్య, రానా మహేష్ బాబు, రవితేజ, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇలా దాదాపు 113 మాది సెలబ్రెటీలను కొంచెం టచ్ లో ఉంటె చేప్తా షోకి తీసుకొచ్చాడు.

Also Read:

బరువుపై వచ్చిన కామెంట్స్ తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అందాల బొమ్మ నమిత

‘రాధాకృష్ణ’ను అందరూ ఆదరించాలి.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళుతానంటున్న మంత్రి..