Evaru Meelo Koteeswarulu : ‘ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు’ అంటున్న తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలతోనే కాదు బుల్లితెర గేమ్ షోలతోనూ అలరిస్తున్నారు. ఇప్పటికే రియాలిటీ షో బిగ్ బాస్‌‌‌కు

Evaru Meelo Koteeswarulu : ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు అంటున్న తారక్
Ntr

Updated on: Aug 07, 2021 | 4:41 PM

Evaru Meelo Koteeswarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలతోనే కాదు బుల్లితెర గేమ్ షోలతోనూ అలరిస్తున్నారు. ఇప్పటికే రియాలిటీ షో బిగ్ బాస్‌‌‌కు హోస్ట్‌‌‌గా వ్యవహరించి అందరిని ఆకట్టుకున్నారు. ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ ప్రేక్షకులముందుకు రావడానికి సిద్దమయ్యారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌‌‌‌లో బిజీగా ఉన్న తారక్ త్వరలో ఈ గేమ్ షోను హోస్ట్ చేయనున్నారు. ప్రముఖ ఛానల్‌‌‌‌లో ప్రసారం అయ్యే ఈ గేమ్ షోకు తారక్ హోస్ట్‌‌‌‌గా వ్యవహరించనున్నారు. గతంలో స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ‘మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు’ గేమ్ షో ఇప్పుడు ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’గా మారి మరో ఛానల్‌‌‌‌లో ప్రసారం కాబోతుంది. ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోకు కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌‌‌‌లుగా చేశారు. ఇప్పుడు తారక్ తనదైన స్టైల్‌‌‌‌లో ఈ షోను హోస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా ఈ గేమ్ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు నిర్వాహకులు.

‘రండి గెలుద్దాం… ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ తారక్ చెప్పే డైలాగ్‌‌‌‌తో ఇప్పటికే ఫస్ట్ ప్రోమోను విడుదల చేయగా తాజాగా సెకండ్ ప్రోమోను రిలీజ్ చేశారు.’ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు’ అంటూ తారక్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అలాగే ‘కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది’ అంటూ మరో డైలాగ్‌‌‌‌తో షో పై ఆసక్తిని పెంచారు తారక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

హైదరాబాద్‌‌‌లో షూటింగ్ జరుపుకుంటున్న మణిరత్నం డ్రీమ్‌‌‌‌ప్రాజెక్ట్.. రెండు వందలమంది డ్యాన్సర్లతో..

Raj Kundra Case: అందుకే అన్యాయంగా పోర్న్ కేసు పెట్టారు.. ముంబై పోలీసులపై గెహనా ఆరోపణలు

Bell Bottom : బాలీవుడ్‌‌‌‌లో మరో రచ్చ.. ఈసారి అక్షయ్ సినిమా పోస్టర్ పై ట్రోల్స్..