ఫ్లాప్‌ హీరో, ఫ్లాప్ హీరోయిన్.. కలిసి హిట్ కొడతారా..!

‘ఆడు మగాడ్రా బుజ్జీ’ దర్శకుడు కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఓ చిత్రంలో నటించనున్నాడు. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘నీది నాదీ ఒకటే లోకం’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో హీరోయిన్‌గా మేఘా లోకేశ్ ఎన్నికైనట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. కాగా ‘ఈడో రకం ఆడో రకం’ తరువాత చెప్పుకోదగ్గ హిట్‌లకు దూరమయ్యాడు రాజ్ తరుణ్. అలాగే ‘లై’ […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:34 am, Wed, 20 March 19
ఫ్లాప్‌ హీరో, ఫ్లాప్ హీరోయిన్.. కలిసి హిట్ కొడతారా..!

‘ఆడు మగాడ్రా బుజ్జీ’ దర్శకుడు కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఓ చిత్రంలో నటించనున్నాడు. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘నీది నాదీ ఒకటే లోకం’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో హీరోయిన్‌గా మేఘా లోకేశ్ ఎన్నికైనట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్.

కాగా ‘ఈడో రకం ఆడో రకం’ తరువాత చెప్పుకోదగ్గ హిట్‌లకు దూరమయ్యాడు రాజ్ తరుణ్. అలాగే ‘లై’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయిన మేఘా ఆకాశ్ ఆ తరువాత ‘ఛల్ మోహన్ రంగ’తో కూడా ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు తమిళంలోనూ ఆమెకు చెప్పుకోదగ్గ హిట్లు లేవు. మరి ఫ్లాప్‌లో ఉన్న ఈ జోడి కలిసి హిట్ కొడతారేమో చూడాలి.