‘మజిలీ’కి సంగీత దర్శకుడి షాక్..!
ఏప్రిల్5 విడుదలకు సిద్ధమైంది ‘మజిలీ’. దీనికి సంబంధించి ప్రమోషన్లను కూడా ప్రారంభించేశారు రియల్ లైఫ్ కపుల్ నాగచైతన్య, సమంత. వివాహం తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఈ మూవీకి సంగీత దర్శకుడు గోపి సుందర్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పాటలను ఎప్పుడో ఇచ్చేసిన గోపిసుందర్, రీరికార్డింగ్‌కు మాత్రం సమయం లేదని, తాను చేయలేనని చెప్పుకొచ్చారట. దీంతో దర్శకనిర్మాతలు […]

ఏప్రిల్5 విడుదలకు సిద్ధమైంది ‘మజిలీ’. దీనికి సంబంధించి ప్రమోషన్లను కూడా ప్రారంభించేశారు రియల్ లైఫ్ కపుల్ నాగచైతన్య, సమంత. వివాహం తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఈ మూవీకి సంగీత దర్శకుడు గోపి సుందర్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన పాటలను ఎప్పుడో ఇచ్చేసిన గోపిసుందర్, రీరికార్డింగ్‌కు మాత్రం సమయం లేదని, తాను చేయలేనని చెప్పుకొచ్చారట. దీంతో దర్శకనిర్మాతలు సంగీత దర్శకుడు థమన్‌ను సంప్రదించారని టాక్. అయితే కూడా ఆయన భారీ రేటును డిమాండ్ చేశారట. ఇలా వరుస షాక్‌లతో మజిలీ టీం డైలామాలో పడ్డట్లు తెలుస్తోంది. మరి ఈ సమస్యను మజిలీ టీం ఎలా పరిష్కారం చేసుకుంటుందో చూడాలి. కాగా నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ నిర్మించిన విషయం తెలిసిందే.