Krishna Mukunda Murari,14 August: కృష్ణకు ప్రపోజ్ చేద్దామనుకున్న మురారీ.. గెటప్ చేంజ్ చేసిన కృష్ణను చూసి ఫ్యామిలీ షాక్.. ఈ రోజు ఎపిసోడ్ లో

| Edited By: TV9 Telugu

Aug 14, 2023 | 12:03 PM

కృష్ణ ముకుంద మురారీ కూడా సూపర్ హిట్ మలయాళం సీరియల్ ను రీమేక్ చేసిందే.. అయితే నటీనటులు పోటాపోటీల మీద నటిస్తూ.. సీరియల్ మీద ఆసక్తిని పెంచేస్తున్నారు.  కృష్ణ మెడికల్ క్యాంప్ పేరుతొ ఇంటిని వదిలి వెళ్ళడానికి రెడీ అవుతుంది. సంతోషంలో ముకుంద ఉండగా.. నందు, సిద్ధులు ఎలాగైనా కృష్ణను ఇల్లు వదిలి వెళ్లకుండా ఆపాలి అని ఆలోచిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆగస్టు 14 ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకుందాం.. 

Krishna Mukunda Murari,14 August: కృష్ణకు ప్రపోజ్ చేద్దామనుకున్న మురారీ.. గెటప్ చేంజ్ చేసిన కృష్ణను చూసి ఫ్యామిలీ షాక్.. ఈ రోజు ఎపిసోడ్ లో
Krishna Mukunda Murari
Image Credit source: Hotstar
Follow us on

భిన్నమైన కథల తో ఆకట్టుకునే కథనంలో డైలీ   సీరియల్స్ ను ప్రసారం చేస్తూ స్టార్ మా ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ సీరియల్ గా దూసుకుపోతున్న కృష్ణ ముకుంద మురారీ కూడా సూపర్ హిట్ మలయాళం సీరియల్ ను రీమేక్ చేసిందే.. అయితే నటీనటులు పోటాపోటీల మీద నటిస్తూ.. సీరియల్ మీద ఆసక్తిని పెంచేస్తున్నారు.  కృష్ణ మెడికల్ క్యాంప్ పేరుతొ ఇంటిని వదిలి వెళ్ళడానికి రెడీ అవుతుంది. సంతోషంలో ముకుంద ఉండగా.. నందు, సిద్ధులు ఎలాగైనా కృష్ణను ఇల్లు వదిలి వెళ్లకుండా ఆపాలి అని ఆలోచిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆగస్టు 14 ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకుందాం..

కృష్ణ రేపటి నుంచి నేను మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతాను.. నా మనసులో మీరున్నారు.. మీ తలరాతలో నేను ఉన్నా.. కానీ మీ మనసులో నేను లేను.. మనకు ఎలా రాసుందో తెలియదు కానీ.. ఇప్పటికి ఇంతే.. ఇంకా వీడ్కోలే..  తెలిసో తెలియకో మీ మనసు నొప్పించి ఉంటె నన్ను క్షమించండి.. గుడ్ మార్ని గ్ ఏసీపీ సార్ అంటే.. మురారీ గుడ్ మారింగ్ చెబుతాడు. క్యాంప్ కు త్వరగా వెళ్లాలి.. త్వరగా రెడీ అవ్వడి.

ఇవి కూడా చదవండి

మీరు ఏ షాంపూ వాడతారు.. అని అడిగి.. కొన్ని షాంపూ పేకెట్స్ మురారీ చేతిలో పెట్టి.. మీరు వీటిని టీవీ యాడ్స్ లో చూసి ఉంటారు కానీ.. వాడి ఉండరు కదా.. రేపటి నుంచి వీటిని వాడండి.. ఎందుకంటే  అప్పుడప్పుడు మిడిల్ క్లాస్ అలవాట్లు కూడా చేసుకోవాలని చెబుతుంది. కొన్ని చిన్న చిన్న అలవాట్లే లైఫ్ లో గొప్ప మార్పుని తీసుకొస్తాయి ఒక్కసారి వాడి చూడండి..

గౌతమ్, నందిని ప్లాన్

సిద్ధుకి టీ ఇస్తూ నందిని తన మనసులో మాటని చెబుతుంది.. కృష్ణ ఈ గడప దాటే లోపే మురారీ తనను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాడని తెలియాలి అంటూ నేను కృష్ణకు మురారీ ప్రేమ గురించి చెప్పేటప్పుడు.. నువ్వు ఆ చుట్టు పక్కలే ఉండాలి.. ఎందుకంటే మురారీ తన ప్రేమ విషయం కృష్ణకు చెప్పనీయడు .. ఖచ్చితంగా నన్ను చెప్పకుండా అడ్డుకుంటాడు.. కనుక ఆ టైం లో నువ్వు మురారీని పక్కకు తీసుకుని వెళ్ళాలి అంటుంది.. అలాగే నందు.. నువ్వు కృష్ణకు మురారీ ప్రేమని చెప్పే టైం కు మురారీని పక్కకు తీసుకుని వెళ్తాను అని మాట ఇస్తాడు గౌతమ్. కానీ ఒకేవేళ నిజంగానే కృష్ణకు మురారీ అంటే ఇష్టం లేదంటే అప్పుడు ఏమి చేస్తావని ప్రశ్నని లేవదీస్తాడు గౌతమ్..

కృష్ణను నిలదీస్తాను గౌతమ్.. మా అన్న అంటే ఎందుకు ఇష్టం లేదు..  ఇష్టం లేకుండా మా అన్నతో ఎలా తాళి కట్టించుకున్నావు.. ఒక అబ్బాయి అంటే ఇష్టం లేకుండా అలా ఎలా తాళి కట్టించుకుంటారు. గౌతమ్.. ఇష్టం లేకుండా ఒకేగదిలో ఒక ఏడాది ఎలా కలిసి ఉంటారు.. ఎంత అగ్రిమెంట్ అయితే మాత్రం.. అలా ఎలా ఉంటారు వాడేమో ప్రేమిస్తున్నానని.. నెత్తినోరు మొత్తుకుని ఏడుస్తున్నాడు.. వీడేమో అభిమానం ఆరాధన అంటూ ఏవేవో.. మాట్లాడుతుంది.. వీళ్ల గురించి ఆలోచిస్తుంటే పిచ్చి ఎక్కుతుంది నాకు ఏమీ చెయ్యాలో అర్ధం కావడం లేదు నాకు.. ఇన్నాళ్లు మనలో ఒకమనిషిలా కలిసి పోయి.. ఇప్పుడేమో టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతుందా అని అంటుంటే.. కూర్చుని మాట్లాడదాం.. సర్దిచెబుదాం అంటారు గౌతమ్.. లేదు సర్ది చెప్పే స్థాయి ఎప్పుడో దాటిపోయింది అంటుంది నందు.. నిలదీయాల్సిందే.. కృష్ణను నిలదీసే చనువు హక్కు నాకు ఉన్నాయి.. అంటుంది నందు…

కృష్ణ, మురారీల గురించి ఆలోచిస్తున్న రేవతి..

రేవతి కృష్ణ ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అనుకుంటుందా దేవుడా అలాంటిది జరగకూడదు అని అనుకుంటుంటే.. భవానీ కాఫీ తెచ్చి ఇస్తుంది.. అదేమిటి అక్క నేను ఇచ్చేదానిని కదా అంటుంది.. ఎప్పుడూ నువ్వే ఇవ్వాలా.. నేను ఇవ్వకూడదా అని అంటుంది.. ఈ మధ్య ఎప్పుడూ నువ్వు ఎదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటున్నావు.. దీనిగురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది భవానీ.. అలాంటిది ఏమీ లేదక్కా అంటూ కృష్ణ క్యాంప్ కు వెళ్తుంది కదా.. అక్కడ ఎలా ఉంటుందో అని భయం అని చెబితే.. దేని గురించి భయం రేవతి అని అడుగుతుంది భవానీ.. ఎలా చెప్పను అక్క నీకు కృష్ణ ఇప్పుడు క్యాంప్ కు వెళ్లి తిరిగి వస్తుందో లేదో తెలియదు.. వాళ్లు వాళ్ళ అగ్రిమెంట్ కు కట్టుబడి ఉన్నారా.. లేదా మనం చేసిన పెళ్ళిని గౌరవిస్తారా.. వాళ్ళ ఉద్దేశాలు.. ఆలోచనలు అర్ధం కావడం లేదు.. ఆలోచిస్తుంది రేవతి.

కృష్ణకు హాస్పటల్ కట్టిస్తానన్న భవానీ

పెళ్లి అయినా వెంటనే ఇలా జంట విడిపోవడం నచ్చలేదు అక్క అంటే.. కృష్ణ పేదలకు ఉచితంగా వైద్యం చేసి వాళ్ళ ప్రాణాలు కడడానికి వెళ్తుంది.. మనం గర్వపడాలి.. మన కుటుంబ ప్రతిష్ట పెంచుతుంది అని అంటూనే.. కృష్ణకు ఒక హాస్పటల్ కట్టించాలి అనుకుంటున్నా అని చెబుతుంది భవానీ. రేవతి చాలా సంతోష పడుతుంది ఆ మాటతో..

కృష్ణ పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తానని వాళ్ళ అమ్మనాన్నకు ఇచ్చిన మాటను మనం నెరవేరుస్తా అంటే.. కానీ నాకు ఒక చిన్న భయం అక్క.. కృష్ణ 24 గంటలు వైద్య సేవలోనే ఉండి.. ఇంటి రావడం మానేస్తే అని అంటే.. భవానీ నవ్వుతుంది.. వాళ్లిద్దరూ నిజమైన భార్యాభర్తలు కారని తెలిస్తే అక్క ఎలా ఫీల్ అవుతుందో అని అనుకుంటుదని రేవతి.. తన మనసు ఎంత బాధపడుతుందో.. దేవుడా కృష్ణ, మురారిలు నిజమైన భార్యాభర్తల్లా జీవించాలి అని కోరుకుంటుంది రేవతి..

కృష్ణ వదిలి నేను ఉండగలనా అనిపిస్తుంది. ఇదే ఫీలింగ్ కృష్ణకు ఉంటే ఎంత బాగుండును.. ఫ్రెండ్స్ కు రిక్వెస్ట్ పెట్టినట్లు పెట్టాలా అనుకుంటేనే.. ఎందుకు పెట్టకూడదు. లవ్ ప్రపోజ్ చేయవచ్చు కదా అని మళ్ళీ తనలో తానే అనుకుంటుంటే.. కృష్ణ .. మురారీ దగ్గరకు వస్తుంది. ఇంక ప్రపోజ్ చేసి ఏమి లాభం.. గతాన్ని భవిష్యత్ గా అనుకుంటే ఎవరు ఏమి చేస్తాం అని మళ్ళీ మురారీ తనకు తానే సమాధానం చెప్పుకుంటాడు. ఏంటి ఏమిటి ఏసీపీ సార్ డల్ గా ఉన్నారు.. అంటే.. అదేమీ లేదు కృష్ణ.. నా సంగతి ఏమో కానీ నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని కృష్ణను అడుగు తాడు మురారీ.. నేను హ్యాపీగా ఉన్నానా.. జీవితంలో నాకు హ్యాపీ లేదు.. చివరి రోజు హ్యాపీగా ఉండాలని నటిస్తున్నా.. అంటూ ఏసీపీ సార్ కూర్చోండి.. నేను చెప్పేవరకూ కళ్లు తెరవద్దు.. ప్లీజ్ ఏసీపీ సార్ అంటుంది. చివరి రోజు కదా.. మిమ్మల్ని విసిగించేవాళ్లు ఉండరుగా..

ఎంత ముద్దుగా ఉన్నారు ఏసీపీ సార్.. అంటూ కళ్ళు తెరవమని చెప్పి.. పళ్లెం.. నీరు ను చూసి .. ఏమిటిది కృష్ణ అంటే.. ఆరాధన అనుకోండి.. గౌరవం అనుకోండి.. భక్తి అనుకోండి.. ఏమైనా అనుకోండి.. అంటుంటే నన్ను దేవుడిని చెయ్యకు కృష్ణ అంటే.. మనసులో భార్యకు భర్తే కదా దేవుడు అని మనసులో అనుకుని.. ప్లీజ్ ఏసీపీ సార్.. ఇది నా చివరి కోరిక… ఇక మిమ్మల్ని ఏది అడగను.. నా చివరి కోరికను కాదనకండి..ప్లీజ్.. అంటూ మురారీ కాళ్లు కడుగుతుంది.

మొన్న మా నాన్న నా కలలోకి వచ్చి మీ ఏసీపీ సార్ చాలా మంచోడు.. కాళ్ళు కడిగి నీరు నెత్తిమీద జల్లుకునేటంత మంచోడు అని చెబుతుంది. మురారీ.. కృష్ణ క్యాంప్ ఎన్ని రోజులు అంటే.. పది రోజులు.. ఎందుకు ఏసీపీ సార్.. క్యాంప్ అయ్యాక తిరిగి వస్తా అని భయపడుతున్నారా.. అంటే.. పిచ్చిగా మాట్లాడకు కృష్ణ అంటే.. అటుగా వచ్చిన కృష్ణ చాటుగా వీరి మాటలను వింటూ ఉంది.. క్యాంప్ త్వరగా అయిపోతే.. ఊరువెళ్తావా లేకపోతె ఇంటికి వచ్చేస్తావా అంటూ ముకుంద టెన్షన్ పడుతుంటే.. మురారీ ఇంటికి వచ్చేస్తావా అని అడుగుతాడు..

ఇంతలో భవానీ కృష్ణ, ముకుంద, మురారి అందరూ కిందకు రండి అనిపిస్తుంది.. పెద్దత్తయ్య రమంటున్నారు.. మీరు రండి అంటూ కిందకు వస్తుంది.. క్యాంప్ అయిపోతే ఏమి చెప్పదలచుకుంది అనుకుంటాడు మురారీ..

అలేఖ్య ని ఏడిపించిన మధు


కృష్ణ చీర వదిలేసి.. డ్రెస్ వేసుకోవడం చూసి నేను ఒకటి ఫిక్స్ అయ్యా అని అలేఖ్య అంటే.. కొంపదీసి నువ్వుకూడా డ్రెస్ వేసుకుంటా అని అనుకుంటున్నావా ఏమిటి అంటే.. అవును అంటుంది అలేఖ్య.. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు.. కృష్ణ అంటే సన్నగా నాజూకుగా ఉంటుంది.. మరి నువ్వేమో.. డ్రమ్ లా ఉంటానా.. రోడ్డు రోలర్ ఉంటానా అంటూ అలేఖ్య అంటే.. అన్నీ నువ్వు అనేసుకున్నాక.. నేను ఏమి చెబుతా బంగారం..

ఏమిటిది చక్కగా చీర కట్టుకున్న కృష్ణ.. ఇప్పుడు పెళ్లి కానీ అమ్మాయిలా డ్రెస్ వేసుకుంది.. అంటే క్యాంప్ అయ్యాక ఇక వస్తుందా రాదా అంటూ రేవతి ఆలోచిస్తుంది. కృష్ణ డ్రెస్ వేసుకోవడం చూసి అందరూ షాక్ తింటారు.. ప్రసాద్ .. మురారీని తను మన కృష్ణ ఏనా.. కట్టుబొట్టు మారింది.. నాకు నచ్చలేదు అంటే.. అంటే తనకు క్యాంప్ కు వెళ్తుంది కదా బాబాయ్ అని అంటాడు మురారి.. క్యాంప్ కు వెళ్తే చీర కట్టుకు వెళ్ళకూడదా .. నువ్వు ఎన్నైనా చెప్పారా.. తనకు ఇలా నాకు నచ్చలేదు అని అంటే.. కృష్ణ గెటప్ మారితేనే తీసుకోలేకపోతున్నారు.. ఇక తను తిరిగి రాదు అని తెలిస్తే మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు.. నిజం చెప్పి మీరు అందరిని బాధపెట్టడం ఇష్టం లేక బాధ అంతా నేను ఒక్కడినే మోస్తున్నా అని మురారీ అనుకుంటాడు.

డ్రెస్ లో పెళ్లికాని అమ్మాయిలా ఉన్నావన్న ముకుంద..

భవానీ కృష్ణను చూసి.. ఏమి తింగరి పిల్లా కట్టుబొట్టు మార్చేశావు అంటే, క్యాంప్ కు వెళ్తున్నా కదా అత్తయ్య.. కంఫర్ట్ గా ఉంటుందని అంటుంటే.. ముకుంద కృష్ణ.. డ్రెస్ చక్కగా పెళ్లికాని అమ్మాయిలా ఉన్నావు అంటుంది.. కృష్ణ థాంక్యూ ముకుంద అని చెబుతుంది. ఇంతలో నందిని కృష్ణ కొత్త జీవితం ప్రారంభించబోతుందని సింబాలిక్ గా కొత్త గెటప్ వేసిందేమో.. కానీ నేను నిన్ను వెళ్లనివ్వను కృష్ణ అనుకుంటుంది నందిని. మా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్న విషయం ఖచ్చితంగా చెబుతాను.. నువ్వు కూడా మా అన్నయ్యను ప్రేమిస్తున్న విషయం నాకు తెలుసు.. కానీ మీ ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది ఉంది.. ఆది నేను తుడిచేసాను అనుకుంటుంది.

ఇంట్లో ప్రసాద్ కృష్ణ.. నువ్వు ఫీల్ అవ్వను అంటే ఒక మాట చెప్పనా అంటే.. చెప్పండి మామయ్య అంటుంది కృష్ణ.. నిన్ను ఇలా డ్రెస్ లో చేస్తుంటే.. ఎవరినో కొత్త అమ్మాయిని చూస్తున్నట్లు కృష్ణ.. నీకు ఈ డ్రెస్ బాగుంది.. కానీ మాకు మా తింగరి పిల్ల అంటే చీర కట్టుకున్న కృష్ణే నచ్చుతుంది అంటాడు ప్రసాద్. మీ అందరికి మా అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి చెప్పలేక.. ఇక నేను వెళ్లిపోతున్నా అని చెప్పడానికే పెళ్లికాని అమ్మాయిలా వేషం మార్చి రెడీ అయ్యా మామయ్య అనుకుంటుంది కృష్ణ.. ఇంతలో భవానీ మాట్లాడుతూ.. ఏయే తింగరి పిల్లా నువ్వు త్వరగా క్యాంప్ ముగించుకుని రాగానే.. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అంటుంది .. వెంటనే ముకుంద.. మళ్ళీ ఏమి ప్లాన్ చేశారు అత్తయ్య .. మళ్ళీ మాంగళ్య ధారణ అయిపొయింది.. పట్టాభిషేకం అయిపొయింది.. ఇంకా ఏమి చేస్తారు దానికి.. అయినా మీరు ఎన్ని చేసినా మళ్ళీ తాను తిరిగి రావాలిగా అనుకుంటుంది ముకుంద..

ఏమిటి పెద్దత్తయ్య సర్వప్రయిజ్ అని కృష్ణ అడిగితె… వెళ్ళిరా వచ్చాక తెలుస్తుడ్ని అంటే.. నేను మీకు ఒక్క మాటకూడా చెప్పకుండా వెళ్లిపోవడం ఎదో లా ఉంది అనుకుంటుంది కృష్ణ..

రేపటి ఎపిసోడ్ లో

ఏడుస్తున్న కృష్ణను ఓదార్చిన భవానీ.. క్యాంప్ కు బయల్దేరిన మురారీ..