Krishna Mukunda Murari,10 August: మురారీ ప్రేమ కోసం ఎన్ని జన్మలైనా ఎత్తుతా అంటున్న కృష్ణ.. ముకుంద ప్రేమ గెలవదని చెప్పిన అలేఖ్య..

|

Aug 11, 2023 | 7:40 AM

మురారీకి ఇచ్చింది గుర్తు చేసుకుని.. దానికి ఒక ప్రత్యేక ఉంది .. కొంతకాలానికి నల్లగా మారిపోతుంది.. అప్పుడు నేను వెళ్ళిపోతాను అన్న విషయం గుర్తు చేసుకుంటుంది. ఏమిటి ఏసీపీ సార్.. నేను ఎందుకు నచ్చలేదు.. నా తింగరి తనం నచ్చలేదా.. మీకు ముకుందలా సీరియస్ గా ఉండేవారు ఇష్టమా.. అయినా కృష్ణ నీ తింగరి తనం అంటే ఇష్టం అని అనేవారు కదా అని ఆలోచిస్తుంటే.. మురారీ.. అప్పుడే బట్టలు సర్దడం ఎందుకు ఇంకా 10 రోజులు ఉంది కదా అంటాడు..

Krishna Mukunda Murari,10 August: మురారీ ప్రేమ కోసం ఎన్ని జన్మలైనా ఎత్తుతా అంటున్న కృష్ణ.. ముకుంద ప్రేమ గెలవదని చెప్పిన అలేఖ్య..
Krishna Mukunda Murari
Follow us on

కృష్ణ, ముకుందలు పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఓ వైపు ముకుంద ఏడుస్తూ ఆ పెళ్లిని చూస్తుంది. పెళ్లి వేడుక తర్వాత ముకుంద హాల్ ఒంటరిగా నిల్చుని ఆలోచిస్తుంటే ఇంతలో భవానీ వచ్చి.. ముకుందా .. కృష్ణా, మురారీలు దాంపత్యం బాగుండాలని నువ్వుకూడా ముత్తైదువులతో కలిసి పూసలు గుచ్చి చాలా మంచి పని చేసావు..  నా పెద్ద కోడలు అనిపించుకున్నావు అని అంటుంది. మనవాళ్లందరికీ జరిగే మంచి పనిలో మనం అందరం ముందుండాలి. మనవాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్లారు.. అందరిని పిలవని ప్రసాద్ కు చెబుతుంది.. కృష్ణ, మురారీలను తీసుకుని భవానీ దగ్గరకు వస్తుంది. తింగరి పిల్లా ఇప్పటికైనా భయం తీరిందా సంతోషంగా ఉండాలి.. అంటుంది.. ఇంక దిగులెందుకు.. అందరం హ్యాపీగా ఉండాలని అంటుంది భవానీ.. సునంద అందరం గ్రూప్ ఫోటో తీసుకుందాం అని అంటుంది.. అప్పుడు అందుకేగా అందరినీ పిలిపించింది భవానీ ఒకే అంటూ మధు. మధు అని పిలుస్తుంది.

గ్రూప్ ఫోటో..

ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ గ్రూప్ ఫొటోలో ఇంకొన్ని రోజుల్లో వెళ్లిపోయే నేను ఉండకూడదు. నేను ఉంటె నేను వెళ్ళిపోయాక ఆ ఫోటో చూసినప్పుడల్లా నన్ను తిట్టుకుంటారు. అని ఆలోచిస్తుంది భవానీ.. ఎలాగైనా ఈ గ్రూప్ ఫొటోలో ఉండకూడదు అనుకుంటూ.. ఫోటో తీస్తుంటే.. కృష్ణ అక్కడ నుంచి తప్పకుంటుంది. ఇంతలో మధు నన్నోయ్ కృష్ణ ఏది అంటూ అడిగితె.. రేవతి కృష్ణ కోసం వేడుకుతూ.. రేవతి కృష్ణ దగ్గరకు వచ్చి.. ఇక్కడ ఏమి చేస్తున్నావు అంటే.. ఒంట్లో బాగోలేదు అంటుంది.. నాకు తెలుసు కృష్ణ.. మనసులో ప్రేమ దాచుకుని ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు అర్ధం కావడం లేదు.. ఫోటో కోసం అందరూ నీ కోసం ఎదురుచూస్తున్నారు.. రా అని కృష్ణని పిలుస్తుంది. ఇంకొన్ని రోజుల్లో వెళ్లిపోయే నేను అత్తయ్యని మాత్రమే కాదు ఎవరిని బాధపెట్టకూడదు అనుకుని గ్రూప్ ఫోటో కోసం వస్తుంది.

భవానీ ఎక్కడికి వెళ్ళావు గ్రూప్ ఫోటో తీసుకుందాం అన్నా కదా.. అంటూ తనపక్కన నిల్చెబెట్టుకుని కృష్ణ ముకుందలతో కలిసి గ్రూప్ ఫోటో తీసుకుంటారు. తర్వాత ఒకొక్క జంటలు కలిసి ఫోటో తీసుకోమని భవానీ సూచిస్తుంది. ఇప్పుడు కపుల్ ఫొటోస్ అని మళ్ళీ ఏసీపీ సార్ ని ఇబ్బంది పెట్టకూడదు.. ఈసారి రేవతి అత్తయ్యకే కాదు.. ఎవరి దొరకకుండా వెళ్లిపోతాయి వెళ్ళిపోతుంది. మురారీ ఎక్కడికి వెళ్లి  కృష్ణ.. ఇందాక గ్రూప్ ఫోటో ఇష్టం లేకపోయినా బలవంతంగా దిగింది.. మళ్ళీ నాతొ ఫోటో తీసుకోవడం ఇష్టం లేక వెళ్ళిపోయింది. అందరితో సరదాగా గడపవచ్చు కదా అనుకుంటూ కృష్ణను వెదుకుతూ మురారీ వస్తాడు.

ఇవి కూడా చదవండి

కృష్ణ ఫోటోగ్రాఫర్ తో తనకు ఈ ఫోటోలు పర్సనల్ గా కావాలంటూ అతని విజిటింగ్ కార్డు తీసుకుంటుంది. కృష్ణ తండ్రి ఫోటోని చూస్తూ ఏడుస్తుంది.. చాలా బాధగా ఉంది నాన్నా మీ ఫోటో శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండిపోతుంది అనుకున్నా.. ఇలా తీసెయ్యాల్సి వస్తుంది అనుకోలేదు. ఈ ఇంటికి వచ్చి దాదాపు ఏడాది కావొస్తుంది. ఇన్నాళ్లు నేను ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ కాలేదు.. ఎందుకంటే నాకు ఏసీపీ సార్.. ఎప్పుడూ అండగా ఉండేవారు.. నాకోసం ఆయన ఉన్నారు అనే ధీమా ఉండేది.. ఇప్పు ఆ దైర్యం లేదు నాన్నా.. ఈ ఫ్యామిలీలో అందరూ మంచోళ్లు నాన్న.. నువ్వు చివరి క్షణంలో తీసుకున్న నిర్ణయం గొప్పది అంటూ తండ్రిని తలచుకుంటూ కన్నీరు పెట్టుకుంటుంది.

మురారీ ప్రేమ కోసం ఎన్ని జన్మలైనా ఎత్తుతా..

ఎంత వెదికినా నాకు ఇంతకంటే గొప్ప ఫ్యామిలీ దొరకదు.. ఈ కుటుంబంలో ఏసీపీ సార్ చాలా మంచి వారు నిజం చెప్పాలంటే నువ్వు చెప్పిన దానికంటే చాలా చాలామంచి వారు.. నాన్న.. కానీ అయన పరిచయం నాకు చాలా ఆలస్యంగా అయింది నాన్నా.. ఎంత ఆలస్యం  అంటే ఆయన ప్రేమకి నోచుకోవాలంటే.. నేను ఇంకో జన్మ ఎత్తలేమో.. ఆయన ప్రేమ పొందడానికి నేను ఎన్ని జన్మలైనా ఎత్తుతా నాన్నా అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.

ముకుంద ప్రేమ ఓడిపోతుంది అన్న అలేఖ్య

ముకుందను అలేఖ్య ప్రశ్నిస్తూ.. కృష్ణ, ముకుంద పెళ్లిని ఆపేస్తా అన్నావు.. అగ్రిమెంట్ గురించి చెబుతా అన్నావు ఏది జరగలేదు.. నాకు నీ ప్రేమ ఎప్పటికీ గెలవదు అనిపిస్తుంది అంటుంది అలేఖ్య.. అప్పుడు ముకుంద నా ప్రేమ గొప్పదనం నీకు తెలియదు.. వాళ్లిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండరు.. మళ్ళీ పెళ్లి  జరిగిందన్న మాటేగానీ.. ఇద్దరిలోనూ ఆసక్తి, ఆనందం లేదు అంటుంది ముకుంద. వాళ్ళు ఇద్దరూ ఇష్టపడి చేసుకున్న వేడుక కాదనిపించింది .. ఇంకొక సారి నా ప్రేమ ఓడిపోతుంది అన్నావంటే అసలు ఊరుకోను వెళ్లు అంటూ అలేఖ్యని గది నుంచి వెళ్ళిపోమంటుంది.

కృష్ణుడు కూడా నన్ను వెళ్ళమంటున్నాడన్న కృష్ణ..

కృష్ణ తన రూమ్ లో బట్టలు సర్దుకుంటుంది.. ఇంతలో కృష్ణ విగ్రహం బయటపడుతుంది. అది మురారీకి ఇచ్చింది గుర్తు చేసుకుని.. దానికి ఒక ప్రత్యేక ఉంది .. కొంతకాలానికి నల్లగా మారిపోతుంది.. అప్పుడు నేను వెళ్ళిపోతాను అన్న విషయం గుర్తు చేసుకుంటుంది. ఏమిటి ఏసీపీ సార్.. నేను ఎందుకు నచ్చలేదు.. నా తింగరి తనం నచ్చలేదా.. మీకు ముకుందలా సీరియస్ గా ఉండేవారు ఇష్టమా.. అయినా కృష్ణ నీ తింగరి తనం అంటే ఇష్టం అని అనేవారు కదా అని ఆలోచిస్తుంటే.. మురారీ.. అప్పుడే బట్టలు సర్దడం ఎందుకు ఇంకా 10 రోజులు ఉంది కదా అంటాడు.. చూశారా సార్.. ఈ బొమ్మ కూడా నన్ను వెళ్ళిపోమంటుంది అంటుంది కృష్ణ.. బొమ్మ కూడా అంటుంది.. అసలు తనని ఎవరు వెళ్ళమన్నారు.. ఇదే సమయం నా ప్రేమ గురించి చెప్పేస్తా అని మురారీ అనుకుంటుంటే.. మళ్ళీ కృష్ణనే మాట్లాడుతూ.. మీకు చెప్పలేదు కదా.. ఇక్కడికి 150 కి. మీ దూరంలో ఉన్న గ్రామంలో విష జ్వరాలు వచ్చాయట నన్ను వెళ్లామన్నారు.. రేపు నేను అక్కడికి వెళ్తున్న అని చెబుతుంది..

అగ్రిమెంట్ పూర్తి అవుతుంది ఎలా రాను ప్రశ్నించిన కృష్ణ

ఎన్ని రోజులు కృష్ణ.. రెండు రోజుల్లో వచ్చేస్తావు కదా అని మురారీ అడుగుతాడు.. రావడానికి అవకాశం లేదు ఏసీపీ సార్ అంటుంది కృష్ణ. అప్పటికి మన అగ్రిమెంట్ పూర్తి అవుతుంది రావడానికి ఎలా కుదురుతుంది చెప్పండి.. ఈ ఇంటి కోడలుగా రావాలా,. కుదరదు కదా మీ భార్య రావాలా అది ఎలాగా కుదరదు.. ఇక ఈ ఇంటితోనూ.. ఈ ఇంట్లో ఉన్నవారితోనూ సంబంధం తెరిగిపోయింది.. ఏసీపీ సార్ అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.

రేపటి ఎపిసోడ్ లో..

నేను వెళ్లిపోతున్నా ముకుంద ఎప్పుటికీ తిరిగిరాను..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..