Brahmamudi Serial, August 9th Episode: అటు సంతోషంలో కృష్ణమూర్తి ఫ్యామిలీ.. ఇటు కావ్యపై పడ్డ దుగ్గిరాల ఫ్యామిలీ.. ట్విస్ట్ లే ట్విస్టులు!!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో పుట్టింటికి సహాయం చేయాలని వెళ్లిన కావ్యని ఎలాగైనా ఇరికించాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు. అన్నట్టుగానే కావ్య మట్టి తొక్కుతున్న వీడియోను దొంగచాటుగా తీయించి.. మీడియాలో వైరల్ చేయమని రాహుల్ చెప్తాడు. రాహుల్ మాటలను విన్న రుద్రాణి.. ఏది ఆ వీడియో నాకు చూపించు అని అడుగుతుంది. రాహుల్ వీడియోని రుద్రాణి చూపిస్తాడు. నువ్వు ఈ వీడియోని మీడియాలో వచ్చేట్టు చేస్తే.. నేను ఆ వీడియోను ఇంట్లో చూపించి యుద్ధం మొదలు పెడతాను అని అంటుంది. ఇక లెటర్ రాసిన అమ్మాయి గురించి ఆలోచిస్తూంటాడు కళ్యాణ్. ఏందిరా భయ్.. వచ్చిన దగ్గర్నుంచి ఏమో ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. నా అభిమాని గురించి..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో పుట్టింటికి సహాయం చేయాలని వెళ్లిన కావ్యని ఎలాగైనా ఇరికించాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు. అన్నట్టుగానే కావ్య మట్టి తొక్కుతున్న వీడియోను దొంగచాటుగా తీయించి.. మీడియాలో వైరల్ చేయమని రాహుల్ చెప్తాడు. రాహుల్ మాటలను విన్న రుద్రాణి.. ఏది ఆ వీడియో నాకు చూపించు అని అడుగుతుంది. రాహుల్ వీడియోని రుద్రాణి చూపిస్తాడు. నువ్వు ఈ వీడియోని మీడియాలో వచ్చేట్టు చేస్తే.. నేను ఆ వీడియోను ఇంట్లో చూపించి యుద్ధం మొదలు పెడతాను అని అంటుంది. ఇక లెటర్ రాసిన అమ్మాయి గురించి ఆలోచిస్తూంటాడు కళ్యాణ్. ఏందిరా భయ్.. వచ్చిన దగ్గర్నుంచి ఏమో ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. నా అభిమాని గురించి.. అని అంటాడు.. పేరు తెలుసుకుని ఏం చేస్తావ్.. అని అంటుంది అప్పు.
ఇక కళ్యాణ్ అరచేతి వంక అలా చూస్తేనే ఉంటాడు. ఈలోపు కొండదేవర ఒకతను వచ్చి.. దేని గురించి అడిగినా చెప్పడానికి ఈ కొండ దొర ఉన్నాడు.. మీ చేతి రేఖలను మీరే చూసుకుంటున్నారు ఏంటి దొర అని అడుగుతాడు. దీంతో దొరికింది.. దొరికేసింది అంటూ ఆనందంతో కొండ దొరకి డబ్బు ఇస్తాడు కళ్యాణ్. ఏం దొరికింది అంటుంది అప్పు. తన పేరు ‘ఆర్’ అనే అక్షరంతో మొదలవుతుంది అని కళ్యాణ్ అంటాడు. ‘జీ’ అనే అక్షరంతో కూడా మొదలవ్వొచ్చు కదా.. గీత కూడా అయి ఉంటుంది కదా.. వెంటనే ఆ పిల్లకి ఫోన్ చేసి ఏదో ఒక అక్షరం చేసి చెప్పు అని అంటుంది అప్పు.
ఈ సీన్ కట్ చేస్తే.. అపర్ణ టీవీ ఆన్ చేస్తే.. కావ్య మట్టి తొక్కుతున్న వీడియో ప్లే అవుతుంది. అది విన్న దుగ్గిరా ఫ్యామిలీ మొత్తం షాక్ కి గురవుతుంది. దీంతో అపర్ణ రెచ్చిపోతుంది. తనని ఇంట్లో నుంచి డబ్బు తీసుకెళ్లినందుకు నిలదీశామని.. ఈ రకంగా కావాలని చేస్తుంది అంటూ అంత ఎత్తున లేస్తుంది. కావాలనే ఈ ఇంటి పరువు తీస్తోందని రగిలిపోతుంటుంది. మధ్యలో రుద్రాణి మాట్లాడుతూ.. ఆ మీడియా కవరేజ్ కూడా కావ్యే చేయించి ఉంటుంది అంటూ మరో అగ్గిపుల్ల రాజేస్తుంది. అత్తయ్య నా మనవరాలు.. నా మనవరాలు అని అలుసు ఇచ్చారు కాబట్టే.. ఈ రోజు ఇంతకు తెగించింది.. నేను అందుకే పుట్టింటితో సంబంధాలు ఉండకూడదు అన్నది.. ఇప్పుడు చూసారా దుగ్గిరాల ఇంటికి ఎంత అప్రదిష్ట తెచ్చిపెట్టిందో.. ఇప్పుడు నేను ఏం చేయాలి? మన ఇంట్లో ఉంటూ.. మన తిండి తింటూ కూటికి గతిలేని దానిలా ప్రపంచానికి చెప్తే.. ఈ ఇంట్లోకి ఎలా రానివ్వాలి? నేనే సమాధానం చెప్తాను అంటూ అపర్ణ నోరు పారేసుకుంటుంది.
ఈలోపు హలో కవి సార్.. కవి సార్ అంటూ కళ్యాణ్ ని ఎదురుగా ఉన్న కిరాణా స్టోర్ అతను పిలుస్తాడు.. ఎక్కడగా అని కళ్యాణ్ వెతుకుతుండగా.. అప్పు అదిగో అక్కడ అంటూ చెప్తుంది. మీకు ఫోన్ వచ్చిందని ఆయన పిలుస్తాడు. నా పేరు మీకెలా తెలుసు? ఈ ఫోన్ లో పిల్ల చెప్పింది.. ఈ ఫోన్ నెంబర్ ఆమెకి ఎలా తెలుసు అని అప్పుడు అడుగుతుంది. బయట బోర్డు మీద రాసుంది అని చెప్తాడు కిరాణా స్టోర్ అతను. ఇక లెటర్ రాసిన అమ్మాయితో ఫోన్ లో మాట్లాడతాడు కళ్యాణ్. నా పేరు డీ కోడ్ చేశారా.. అని అడుగుతుంది. ఆ చేశాం అని కళ్యాణ్ చెప్పగా.. ఆ రెండు పేర్లు నావి కాదు అని అంటుంది. ఇక ఇన్ డైరెక్ట్ గా తన పేరు చెప్పగా.. కళ్యాణ్ కని పెట్టేస్తాడు. మొత్తానికి లెటర్ రాసిన అమ్మాయి పేరు అనామిక అన్న మాట.
ఇక ఆఫీసులో ఉన్న రాజ్ కి ఆయన మేనేజర్ వచ్చి కావ్య వీడియోని చూపిస్తాడు. ఇది చూసిన రాజ్ షాక్ లో ఉంటాడు. వెంటనే ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తాడు. ఈలోగా మట్టి అంతా తొక్కేసి.. బొమ్మలన్నీ రెడీ చేస్తారు కృష్ణమూర్తి ఫ్యామిలీ. మరి వినాయకుడి విగ్రహాలు ఎప్పుడు చేస్తారు? అని కనకం అడగ్గా.. ఆ మట్టిని కాలితో తొక్క కూడదు కదా అమ్మ.. నాన్న మిక్సింగ్ మిషన్ రెంట్ కి తీసుకొస్తా అన్నారు.. వచ్చాక అది రేపు చేస్తాం అంటుంది కావ్య. ఈలోగా కృష్ణ మూర్తి వచ్చి.. బొమ్మలన్నీ చాలా చక్కగా వచ్చాయి అని చెప్తాడు. దీంతో కనకం ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇంక నేను బయలు దేరతాను అంటూ కావ్య రెడీ అవుతుంది. ఈలోగా కనకం సున్ని ఉండలు ఓ బాక్స్ లో వేసి.. అల్లుడి గారికి ఇష్టం కదా.. ఇవ్వు అని ఇస్తుంది. సరే అని కావ్య బయలు దేరుతుంది.
ఇక కావ్య కోసం కాచుకుని కుర్చుంటుంది దుగ్గిరాల ఫ్యామిలీ. కావ్య ఎంటర్ కాగానే ఇంట్లోని పరిస్థితి గమనించి.. చిన్న అత్తయ్య ఏం జరిగింది అని అడుగుతుంది. చెప్పాల్సిన వారు చెప్తారు కావ్య అని అంటుంది ధాన్య లక్ష్మి. ఏం జరిగిందో నీకు తెలీదా అని రుద్రాణి అడుగుతుంది. నా వల్ల ఏదైనా తప్పు జరిగిందనుకుంటున్నారా? అని కావ్య అడుగుతుంది. ఇక అపర్ణ వెంటనే కావ్యపై సీరియస్ అవుతుంది. ఆ రెండు పదాలు సరిపోవు అని అంటుంది. నువ్వు చేసింది మహా అపరాథం.. తిరిగి మళ్లీ ఇంటి గడపలో కాలు పెట్టావంటే.. నీ ధైర్యానికి చూస్తుంటే.. నీకు ఈ కుటుంబంతో పని లేదు. ఈ వంశ మర్యాదలతో లెక్క లేదు అని అంటుంది. ఏంటా అని షాక్ అవుతుంది కావ్య. ఇక రుద్రాణి, కావ్యకి మీడియాలో వచ్చిన వీడియో చూపిస్తుంది. ఇది చూసిన కావ్య ఆశ్చర్యపోతుంది. ఏంటి మాటలు మాయం అయిపోయాయి. నువ్వు నిన్ను సమర్థించుకోవడానికి ఏదో ఒకటి చెప్తావ్ కదా అని అంటుంది రుద్రాణి. నేను నా పుట్టింటికి మాత్రమే సహాయం చేశాను.. మీరంతా ఇది తప్పు అంటూ నన్ను దోషిలాగా నిలబెడితే.. ఏం మాట్లాడాలో నాకు తెలీడం లేదు అని చెప్తుంది కావ్య.
ఇక చాలు ఆపు.. అని కావ్యపై అపర్ణ అరుస్తుంది. నువ్వు ఇప్పుడు ఈ లోకం దృష్టిలో ఈ ఇంటి కోడలివి.. నేను ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. నా కొడుకు నిన్ను భార్యగా అంగీకరించినా.. అంగీకరించకపోయినా.. ప్రపంచం నిన్ను బలవంతంగా ఈ ఇంటికి పంపించింది. ఇప్పుడు నువ్వు వెళ్లి కష్టపడుతూ.. ఆ కష్టాన్ని పది మందికి తెలిసేలా.. ఈ ఇంటి పరువు తీస్తుంటే లెక్కలేని తనం కాకపోతే మరేంటి అని అపర్ణ నిలదీస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఇంటి మీదకి మళ్లింది. నువ్వుతప్పు చేస్తే ప్రతీ ఒక్కరూ ఈ ఇంటి పెద్దల్ని ప్రశ్నిస్తారు అని అడుగుతుంది అపర్ణ. దయచేసి ఇది తప్పు అని అనకండి.. కష్టపడటం తప్పు ఎలా అవుతుంది అండి? అని అంటుంది. కళ అనేది వృత్తి కాదు.. ప్రవృత్తి అని అంటుంది కావ్య. ఈలోపు రాజ్ ఆవేశంగా ఇంటికి వస్తూ కావ్యపై అరుస్తాడు. ఏం తెలుసుకోమంటావ్ చెప్పు? నీ ప్రవృత్తి వల్ల నీకు మానసిక ఆనందం మాత్రమే కలుగుతుందా? నీకు డబ్బు కూడా వస్తుంది కాదా? అంటూ కావ్యని నిలదీస్తాడు రాజ్. దీంతో నేటితో ఇక్కడి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.