Keerthy Suresh: పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లొచ్చావ్.. కీర్తి సురేష్ బాషా లెవల్ ఫ్లాష్ బ్యాక్..

దక్షిణాదిలోని అగ్ర హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. బాలనటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లల్లోనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. తమిళం, తెలుగు భాషలలో సక్సెస్ అయిన కీర్తి.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ అమ్మడు జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో పాల్గొంది.

Keerthy Suresh: పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లొచ్చావ్.. కీర్తి సురేష్ బాషా లెవల్ ఫ్లాష్ బ్యాక్..
Keerty Suresh

Updated on: Oct 09, 2025 | 6:45 AM

కీర్తి సురేష్… సౌత్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు దశాబ్ద కాలంగా తనదైన నటనతో సినీప్రియులను అలరిస్తుంది. ఇప్పటివరకు దక్షిణాదిలో సక్సెస్ అయిన కీర్తి.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఆమె హిందీలో నటించిన తొలి చిత్రం బేబీ జాన్ అంతగా ఆకట్టుకోలేదు. అయితే కొన్నాళ్లుగా గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది ఈ అమ్మడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రెగ్యులర్ ఫోటోషూట్లతో గత్తరలేపుతుంది. కానీ ఇటీవల ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలో తాజాగా జగపతి బాబు హోస్టింగ్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోలో పాల్గొంది. ఇందులో తన పర్సనల్ విషయాలు రివీల్ చేసింది.

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

ఇవి కూడా చదవండి

విలక్షణ నటుడు జగపతి బాబు హోస్టుగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సంగతి తెలిసింది. ఇటీవల నాగచైతన్య ఇందులో పాల్గొని అనేక విషయాలు పంచుకున్నారు. ఇక ఇప్పుడు ఇందులో కీర్తి సురేష్ పాల్గొన్నారు. ఇప్పటికే ఆమె ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. క్వశ్చన్స్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేశాం కదా అంటూ రాసుకొచ్చారు. ఇందులో కీర్తి గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలపై జగపతి బాబు ప్రశ్నలు అడిగారు. “నీకు బాషా లెవల్ ఫ్లాష్ బ్యాక్ ఉందట కదా..? పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లొచ్చావ్ ” అని జగపతి బాబు ప్రశ్నించగా.. చాలాసార్లు వెళ్లాను అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

కీర్తి సురేష్ డిస్ట్రిక్ట్ లెవల్ క్రికెట్ ప్లేయర్ అనే విషయాన్ని సైతం బయటపెట్టారు. క్రికెట్ ఆడుతూ సిక్స్ కొడితే ఆంటోనీ (కీర్తి సురేష్ భర్త) క్యాచ్ పట్టుకున్నాడా ? అని అడగ్గా.. నన్ను క్యాచ్ పట్టుకున్నాడంటూ నవ్వేసింది. ఇన్ని చేసిన ఒక అమ్మాయిని ఆంటోనీ ఎలా లవ్ చేశాడు అని జగపతి బాబు అడగ్గా.. తన తెలివితో అన్నట్లు బదులిచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. కీర్తి సురేష్ ఎపిసోడ్ ఆదివారం 8.30కు ప్రసారం కానుంది.

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?