Karthika Deepam: సంబరాల్లో వంటలక్క ఫ్యాన్స్.. వంటలక్క ఈజ్ బ్యాక్ హ్యాష్ అంటూ సందడి చేస్తోన్న మీమ్స్..

|

Aug 14, 2022 | 10:15 AM

మళ్ళీ కార్తీక దీపం సీరియల్ కు క్రేజ్ ను తీసుకుని రావడానికి సీరియల్ దర్శకుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ దీప, కార్తీలు బతికి రానున్నారని తెలుస్తోంది. దీంతో 'వంటలక్కా ఈజ్ బ్యాక్ హ్యాష్ ట్యాగ్ #VantalakkaIsBack తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Karthika Deepam: సంబరాల్లో వంటలక్క ఫ్యాన్స్.. వంటలక్క ఈజ్ బ్యాక్ హ్యాష్ అంటూ సందడి చేస్తోన్న మీమ్స్..
Vantalakka Is Back Memes
Follow us on

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై సంచలనం కార్తీక దీపం సీరియల్.. ఒకప్పుడు ఈ సీరియల్ స్టార్ హీరోల సినిమాలకు సైతం షాక్ ఇస్తూ..టాప్ రేటింగ్ తో దూసుకుని వెళ్ళింది. దీనికి కారణం వంటలక్క, డాక్టర్ బాబులు. ముఖ్యంగా వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ నటనకు తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు పట్టంగట్టారు.. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్న సామెతను నిజం చేస్తూ.. ఆదరిస్తున్నారు కదా అంటూ ఈ సీరియల్ ను సాగదీయం ప్రారంభించారు.. అంతేకాదు సీరియల్ ప్రధాన పాత్రలైన దీపక్క, కార్తీక్ బాబుని కారు యాక్సిడెంట్ లో చంపేశారు.. అప్పటి నుంచి మెల్లగా సీరియల్ రేటింగ్ పడిపోవడం ప్రారంభించింది. దీనికి సొల్యూషన్ గా మళ్ళీ కార్తీక దీపం సీరియల్ కు క్రేజ్ ను తీసుకుని రావడానికి సీరియల్ దర్శకుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ దీప, కార్తీలు బతికి రానున్నారని తెలుస్తోంది. దీంతో ‘వంటలక్క ఈజ్ బ్యాక్ హ్యాష్ ట్యాగ్ #VantalakkaIsBack తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓ రేంజ్ లో మీమ్స్ తో క్రియేటర్స్ హల్ చల్ చేస్తున్నారు.  ట్రెండవ్వుతోంది. సింపుల్‌గా నవ్విస్తున్న ఈ మీమ్స్ ను వంటలక్క క్యారెక్టర్ మీద క్రియేట్ చేశారు.

 

ఇవి కూడా చదవండి

లక్షలాది అభిమానుల ఆశలను నిజం చేస్తూ.. దీప మళ్ళీ వస్తోంది అంటూ ఓ ప్రోమోని రిలీజ్ చేశారు.  హాస్పటల్ లో బెడ్ మీద ఉన్న దీప.. ప్రమాద ఘటన గుర్తుచేసుకుంటూ .. కోమా నుంచి బయటకు వస్తోంది. అంతేకాదు.. వెంటనే “డాక్టర్ బాబు” అంటూ ప్రమాద సంఘటనని గుర్తు చేసుకుంటుంది.

దీంతో వంటలక్క అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మళ్ళీ కార్తీక్, మోనితలు కూడా సీరియల్ లో కనిపిస్తారట..  అంటూ ఒకరు, ఆసియా కప్ వస్తుంది.. మా క్రికెట్ లవర్స్ ను మీ టీఆర్ఫీ రేటింగ్ కోసం ఇబ్బంది పెట్టొద్దు..

వంటలక్కను ఇంకొన్ని రోజులు అండర్ గ్రౌండ్ కు పంపండి అని ఇంకొకరు ..

చనిపోయావు.. నీ కష్టాలు అన్నీ తీరిపోయాయి అనుకుంటే.. మళ్ళీ వచ్చా అంటూ ఒకరు ..

ప్రతి రాఖీ పండక్కి అక్క ఇంటి వస్తే.. ఈ సారి రాఖీ పండక్కి.. వంటలక్క వచ్చింది అంటూ రకరకాల మీమ్స్ తో అభిమానులు సందడి చేస్తున్నారు.

 

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..