RRR Television premiere: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (JR.NTR) హీరోలుగా నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ (RRR). దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ఈ ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించాడు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఓలివియా మోరీస్, శ్రియాశరణ్, అజయ్‌దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు ఈ విజువల్ గ్రాండియర్‌లో నటించారు. భారీ బడ్జెట్ తో రూపొంది ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. చెర్రీ, తారక్‌ల నటన, జక్కన్న టేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. విడుదలై నాలుగు నెలలవుతున్నా డిజిటల్ స్ర్కీన్‌పై రికార్డు స్థాయి వ్యూస్‌లు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ విజువల్ గ్రాండియర్ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న ఈ సినిమా టీవీలో రానుంది. స్టార్ మా ఛానెల్‌లో ఈ మూవీ ప్రీమియర్ కానుంది. అయితే ఏ సమయంలో ప్రసారం కానుందన్న విషయంపై ఛానల్ క్లారిటీ ఇవ్వలేదు. అదే రోజు రాత్రి 8 గంటలకు జీ సినిమాలో హిందీ వెర్షన్ ప్రసారం కానుంది. మరి థియేటర్లలోనూ, ఓటీటీల్లోనూ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూడలేకపోయిన వారు ఎంచెక్కా టీవీలో చూసి ఎంజాయ్ చేయండి.
Naacho-Naacho ke dhun par ab jhum uthega poora Hindustan!