Jabardasth Pavitra: పెళ్లి చేసుకోబోతున్న జబర్ధస్త్ పవిత్ర.. వరుడు ఎవరంటే ?

|

Dec 09, 2022 | 4:46 PM

ఇందులో లేడీస్ కూడా రాణిస్తూ గుర్తింపు పొందుతున్నారు. ఫైమా.. రోహిణి.. వర్ష.. పవిత్ర వీరి కామెడీతో అతి తక్కువ సమయంలో కామెడీయన్స్‏గా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం షోలోనే కాకుండా.. ఎవరికి వారు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ తమ వ్యక్తిగత జీవితాలను ఫాలోవర్స్ ముందుకు తీసుకువస్తున్నారు.

Jabardasth Pavitra: పెళ్లి చేసుకోబోతున్న జబర్ధస్త్ పవిత్ర.. వరుడు ఎవరంటే ?
Jabardasth Pavitra
Follow us on

బుల్లితెరపై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది జబర్దస్త్ కామెడీ షో. దాదాపు పదేళ్లుగా ఈషో ఆడియన్స్ ను అలరిస్తోంది. ఇప్పటికే ఈషోలోకి వచ్చిన వెళ్లినవారు చాలా మంది ఉన్నారు. జబర్దస్త్ మాత్రమే కాకుండా.. ఎక్స్ ట్రా జబర్దస్త్ ద్వారా ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే ఇందులో యాంకర్స్.. జడ్జీలు కాకుండా… అబ్బాయిలు మాత్రమే ఉండేవారు. వారే లేడీ గెటప్స్ వేసి నవ్వించేవారు. కానీ ఇప్పుడు ఈ షో పూర్తిగా మారిపోయింది. ఇందులో లేడీస్ కూడా రాణిస్తూ గుర్తింపు పొందుతున్నారు. ఫైమా.. రోహిణి.. వర్ష.. పవిత్ర వీరి కామెడీతో అతి తక్కువ సమయంలో కామెడీయన్స్‏గా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం షోలోనే కాకుండా.. ఎవరికి వారు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ తమ వ్యక్తిగత జీవితాలను ఫాలోవర్స్ ముందుకు తీసుకువస్తున్నారు.

ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారానే తమ ప్రేమ.. పెళ్లి గురించి చెబుతూ.. తమకు కాబోయే వరుడిని ముందే పరిచయం చేస్తున్నారు. అంతేకాకుండా.. వారి కుటుంబసభ్యులతో కలిసి చేసే షాపింగ్ వీడియోస్.. హల్దీ.. సంగీత్ వీడియోస్ షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా జబర్ధస్త్ లో ఓ పెళ్లి పీటలెక్కబోతుంది. వారు ఎవరంటే.. జబర్ధస్త్ పవిత్ర, తేజ. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇప్పుడు ఆకస్మాత్తుగా మా పెళ్లి షాపింగ్ అంటూ వీడియో షేర్ చేయడంతో నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

మా పెళ్లి షాపింగ్ అంటూ హెడ్డింగ్ పెట్టి.. జబర్దస్త్ తేజ తో కలిసి వీడియోలో కనిపించింది పవిత్ర. మాకు పెళ్లి కుదిరింది. అందుకే పెళ్లి చీరలు కోసం షాపింగ్ చేయడం కోసం వచ్చాం అంటూ తేజ చెప్పగా.. ఊరికే అంటూ సైగలు చేసింది పవిత్రా. షాపింగ్ చేసినంత సేపు తన వరుస పంచులతో పవిత్రను ఓ ఆటాడుకున్నాడు తేజ. తన కామెడీతో ఎంత చిరాకు తెప్పించినా పవిత్ర ఓపికతో షాపింగ్ చేసి.. తేజకు తెలియకుండా అతని కార్డ్ తోనే బిల్లు కట్టింది. అయితే తేజ కామెడీ.. పవిత్ర రియాక్షన్స్ చూస్తే మాత్రం ఇది కేవలం ప్రమోషన్ వీడియో అని.. వీరిద్దరికి పెళ్లి అనేది నిజం కాదని అర్థమవుతుంది. దీంతో వీరిద్దరి తీరుపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.