AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punch Prasad- Roja: రోజా కాళ్లు మొక్కి ఏడ్చిన జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్.. వీడియో వైరల్.. ఏం జరిగిందంటే?

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన ప్రాసలు, పంచులతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా దగ్గరైపోయాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఆ మధ్యన కిడ్నీ సమస్యలతో మంచాన పట్టిన మళ్లీ కోలుకుని జబర్దస్త్ షోలో బిజీ అయిపోయాడు.

Punch Prasad- Roja: రోజా కాళ్లు మొక్కి ఏడ్చిన జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్.. వీడియో వైరల్.. ఏం జరిగిందంటే?
Punch Prasad, Roja
Basha Shek
|

Updated on: May 12, 2025 | 3:38 PM

Share

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కిడ్నీ సమస్యలతో మంచాన పడిన అతను థైరాయిడ్ తదితర సమస్యలతోనూ బాగా అవస్థలు పడ్డాడు.అయితే జబర్దస్త్ నటీనటులు, తోటి యాక్టర్లు తలా ఒక చేయి వేయడంతో పంచ్ ప్రసాద్ కోలుకున్నాడు. సర్జరీ కూడా విజయవంతమైందని ఆ మధ్యన ఒక షోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికైతే అతను మళ్లీ మనుపటి లాగే యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. జబర్దస్త్ షోలో మళ్లీ పంచులు, ప్రాసలు పేలుస్తున్నాడు. కాగా పంచ్ ప్రసాద్ చికిత్సకు సాయం చేసిన వారిలో జబర్దస్త్ మాజీ జడ్జి, ప్రముఖ నటి రోజా కూడా ఉన్నారు. అప్పట్లో ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి ప్రసాద్ చికిత్సకు అవసరమైన సాయం అందించారామే. ఇప్పుడిదే విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడీ కమెడియన్. రోజాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు. తాజాగా వీరద్దరు ఓ టీవీషోలో కనిపించారు. ఇదే సందర్భంగా రోజా పట్ల తన అభిమానాన్ని వ్యక్తపరచాడు పంచ్ ప్రసాద్. ‘ఈరోజు నేను నా భార్యపిల్లలతో ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను అంటే.. మీరు పెట్టిన భిక్ష మేడమ్ ఇది.. నిజం చెబుతున్నా మేడమ్.. నాకు మా అమ్మ ప్రాణం పోసింది. నా భార్య నాకు పునర్జన్మనిచ్చింది. నా ట్రీట్‌మెంట్ కోసం మీరు ఎంతో సాయం చేశారు. ఈ అమ్మ నాకు మా అమ్మ కన్నా ఎక్కువ’ అంటూ రోజా స్టేజ్ మీదకి రాగానే కాళ్ల మీద పడ్డాడు ప్రసాద్.

దీని తర్వాత నటి  రోజా కూడా మాట్లాడుతూ ‘ నేను చేయగలిగినంత సాయం చేశాను.. అంతా దేవుడి దయ’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. కాగా ఒకప్పుడు జబర్దస్త్ షోకు జడ్జీగా వ్యవహరించారు రోజా. అదే సమయంలో కంటెస్టెంట్ గా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు పంచ్ ప్రసాద్. అయితే ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ కావడం, మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేశారామె. ప్రజా సేవకే పరిమితమైపోయారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో రోజా ఓటమి పాలయ్యారు. దీంతో మళ్లీ బుల్లితెరకు వచ్చేశారు. పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ కనిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

టీవీ షోలో నటి రోజా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.