Jabardasth Ram Prasad: జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్‌కు యాక్సిడెంట్! షూటింగ్ కు వెళుతుండగా..

|

Dec 05, 2024 | 1:14 PM

జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ కారు ప్రమాదానికి గురైంది. షూటింగ్ కోసం వెళుతుండగా తుక్కు గూడ ఔటర పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో రాంప్రసాద్‌కు గాయాలయ్యయని సమాచారం.

Jabardasth Ram Prasad: జబర్దస్త్ కమెడియన్  ఆటో రాంప్రసాద్‌కు యాక్సిడెంట్! షూటింగ్ కు వెళుతుండగా..
Jabardasth Ram Prasad
Follow us on

జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. అతను ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ కావడంతో జబర్దస్త్ నటుడికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ఎప్పటిలాగానే గురువారం (డిసెంర్ 05) షూటింగ్ కు వెళుతుండగా తుక్కుగూడ సమీపంలో ఆటో రాంప్రసాద్ ముందున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ తరుణంలోనే… జబర్దస్త్ కమెడియన్ కారును వెనక నుంచి ఆటో ఢీ కొట్టడం, ఆ తర్వాత రాంప్రసాద్ కారు ముందు ఉన్న మరో కారుని ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రాంప్రసాద్ కి స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటన పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు  ఆందోళనకు గురవుతున్నారు. ఆటో రాం ప్రసాద్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

జబర్దస్త్ కామెడీ షోతో బాగా ఫేమస్ అయిన కమెడియన్లలో ఆటో రామ్ ప్రసాద్ ఒకరు. తన ఆటో పంచులతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడీ స్టార్ కమెడియన్. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, గెటప్ శీను లతో కలిసి రాం ప్రసాద్..  జబర్దస్త్ వేదికపై చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సుధీర్, గెటప్ శీను జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయినప్పటికీ ఇప్పటికీ టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడు రాం ప్రసాద్. అలాగే శ్రీదేవీ డ్రామా కంపెనీతో పాటు పలు టీవీషోల్లోనూ సందడి చేస్తున్నారు. ఇక వెండితెరపై కూడా అప్పుడప్పుడు మెరుస్తున్నాడీ స్టార్ కమెడియన్.  ఆ మధ్యలో సుధీర్, గెటప్ శీనులను హీరోలుగా పెట్టి  రాం ప్రసాద్ ఓ సినిమా కూడా తీయనున్నాడని వార్తలు వచ్చాయి. ఓ మంచి కామెడీ ఎంటర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు  ప్రచారం జరిగింది. నిర్మాతలకు కథ నచ్చితే త్వరలోనే తమ సినిమాను అధికారికంగా పట్టాలెక్కిస్తానని ఆటో రాం ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కిస్సిక్ సాంగ్ కు ఆటో రాం ప్రసాద్ డ్యాన్స్..

మెగాస్టార్ చిరంజీవితో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.