AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తినడానికి తిండిలేక అలమటించా.. కష్టాలు గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్

ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్. సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయ్యింది. కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు

తినడానికి తిండిలేక అలమటించా.. కష్టాలు గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్
Anchor
Rajeev Rayala
|

Updated on: Aug 16, 2025 | 7:39 AM

Share

జబర్దస్త్ ద్వారా చాలా మంది సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్న విషయం తెలిసిందే. చాలా మంది కమెడియన్స్‌గా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. కొంతమంది హీరోలుగా మరికొంతమంది దర్శకులుగా రాణిస్తున్నారు. వీరితో పాటు యాంకర్స్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనసూయ యాంకర్ నుంచి ఇప్పుడు యాక్టర్ గా మారారు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ అందాల భామ. మరోవైపు రష్మీ కూడా హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. వీరితో పాటే జబర్దస్త్ షోలో తన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది మరో భామ. తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ అమ్మడు. ఎక్కువ కాలం షోలో కనిపించలేదు ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

గతంలో సౌమ్య రావు అనే కన్నడ బ్యూటీ కూడా జబర్దస్త్ కు యాంకర్ గా చేసింది. వచ్చి రాని తెలుగుతో ఈ అమ్మడు ముద్దుముద్దుగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ చిన్నది జబర్దస్త్ కు ఎక్కువ రోజులు యాంకర్ గా కొనసాగలేదు. ఇక ఇప్పుడు సిరిహనుమంతు యాంకర్ గా నెట్టుకొచ్చింది ఇప్పుడు తిరిగి రష్మీ చేతికి వెళ్ళిపోయింది ఆ షో. ఇదిలా ఉంటే సౌమ్య రావు ప్రస్తుతం ఇతర షోలతో, సీరియల్స్ తో బిజీగా మారిపోయింది. అయితే సీరియల్ బ్యూటీ సౌమ్య రావు కెరీర్ లో ఎన్నో కష్టాలను చూసింది. ఆమె అంత ఈజీగా ఈ స్థాయికి రాలేదు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తెలిపింది. గతంలో ఓషోలో సౌమ్య రావు మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది..

ఆమె మాట్లాడుతూ.. “నాకు తెలుగు రాకపోయినా తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు అని తెలిపింది సౌమ్య. అలాగే ఆమె మాట్లాడుతూ ” మా అమ్మే నాకు గురువు. ఆమె సంగీతం నేర్పుతూ మమ్మల్ని పోషించింది.  మా కుటుంబం ఎన్నో కష్టాలను చూసింది. ఒకానొక సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్నాం.. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితికి చేరుకున్నాం అదే సమయంలో మా అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆకలితో ఎదురుచూసేవాళ్ళం.. అందరూ తిన్న తర్వాత మిగిలింది ఎవరైనా తెచ్చి ఇస్తారని ఎదురు చూసేవాళ్లం.. ఆ కష్టాలే మా జీవితాన్ని మరిచేశాయి. ఆ కష్టాలు నన్ను మానసికంగా మరింత బలంగా మార్చాయి” అని తెలిపింది సౌమ్య రావు. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

View this post on Instagram

A post shared by Sowmya Rao (@sowmya.sharada)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.