
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు ముహూర్తం ముంచుకొస్తోంది. ఆదివారం (సెప్టెంబర్ 07)న బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో ఈ లాంఛింగ్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ ఎపిపోడ్ కు రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈసారి కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారా? అని ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈసారి సెలబ్రిటీలతో సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లో అవకాశం కల్పించారు మేకర్స్. ఇందుకోసం అగ్ని పరీక్ష అనే కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో సత్తా చాటిన ఐదుగురు సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్లుగా తీసుకోనున్నారు. వీరితో పాటు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ఈ సారి హౌస్ లోకి రానున్నారు. అయితే ఈ సారి కొంచెం కాంట్రవర్సీ పర్సనాలిటీస్ కూడా హౌస్ లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక హాట్ బ్యూటీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లో పాల్గొందీ అందాల తార. సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అదే సమయంలో ఇతర విషయాలు, వివాదాలతోనూ వార్తల్లో నిలిచింది.
కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రూ. 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో ఈ ముద్దుగుమ్మ పాత్ర ఉందని ప్రచారం జరిగింది. అయితే, అందులో ఎలాంటి నిజం లేదని కావాలనే కొందరు తన పేరును ఇందులోకి లాగుతున్నారని వివరణ ఇచ్చింది.తన దగ్గర అంత డబ్బుంటే ఇలాంటి కష్టాలు ఎందుకు పడుతానంటూ పేర్కొంది. అయితే చాలా మంది లాగే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేస్ లోనూ ఈ ముద్దుగుమ్మ పేరు వినిపించింది. పోలీస్ విచారణను కూడా ఎదుర్కొంది. ఈ క్రమంలో వివాదాలతో తనపై వచ్చిన నెగటివిటిని కాస్త అయినా తగ్గించుకునేందుకు బిగ్ బాస్ మంచి మార్గమని ఈ ముద్దుగుమ్మ భావిస్తోందని సమాచారం. కంటెస్టెంట్ గా ఈ బ్యూటీ ఎంట్రీ దాదాపు ఖాయమని వినిపిస్తోంది.
ఇంతకీ ఈ అందాల తార ఎవరనుకుంటున్నారా? తను మరెవరో కాదు జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి. గత సీజన్లలోనూ ఈ బ్యూటీ పేరు వినిపించినా హౌస్ లోకి అడుగు పెట్టలేదు. అయితే ఈ సారి రీతూ ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఆదివారం అదే బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ దాకా ఆగాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.